Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna Upcoming Movies: పెళ్లయిన తగ్గట్లేదు.. రష్మిక మందాన లైన్లో స్టార్ హీరోలు...

Rashmika Mandanna Upcoming Movies: పెళ్లయిన తగ్గట్లేదు.. రష్మిక మందాన లైన్లో స్టార్ హీరోలు…

Rashmika Mandanna Upcoming Movies: నేషనల్ క్రష్ గా సాధించిన పాపులారిటిని సంపాదించుకున్న నటి ‘రష్మిక మందాన’ రీసెంట్ గా ఆమె విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఆమె పెళ్లికి ముందు కమిట్ అయిన అన్ని సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఆమె నుంచి రావాల్సిన సినిమాలు ఏంటి ఎప్పుడు రాబోతున్నాయనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం… Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ […]

Rashmika Mandanna Upcoming Movies: నేషనల్ క్రష్ గా సాధించిన పాపులారిటిని సంపాదించుకున్న నటి ‘రష్మిక మందాన’ రీసెంట్ గా ఆమె విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఆమె పెళ్లికి ముందు కమిట్ అయిన అన్ని సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఆమె నుంచి రావాల్సిన సినిమాలు ఏంటి ఎప్పుడు రాబోతున్నాయనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..

మైసా

హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ‘మైసా’ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇక ఈ సినిమాను మొదట మార్చి 20వ తేదీన రిలీజ్ చేస్తామని అనుకున్నప్పటికి అది వర్కౌట్ కాలేదు. దాంతో మరోసారి ఈ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు. ఇక అది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద ఇంకా సరైన క్లారిటీ రావడం లేదు…

అల్లు అర్జున్ – అట్లీ మూవీ

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో కూడా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట… ఇప్పటివరకు ఆమె చేయనటువంటి ఒక ప్రత్యేకమైన పాత్ర కావడం వల్లే ఆమె ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…

రణబాలి

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమాలో సైతం రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక సాంగ్ లో విజయ్ రష్మిక కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. నిజానికి వీళ్ళిద్దరు స్క్రీన్ మీద ఏదో మ్యాజిక్ చేయబోతున్నారనే విషయం ఆ సాంగ్ లోనే తెలిసిపోయింది. ఈ సినిమాని ఈ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

కాక్ టెయిల్ 2

షాహిద్ కపూర్ హీరోగా కృతి సనన్, రష్మిక మందాన హీరోయిన్స్ గా నటించిన ‘కాక్ టెయిల్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘కాక్ టెయిల్ 2’ సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…

పుష్ప 3

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేశాయి. ఒక్కసారిగా అల్లు అర్జున్ ను స్టార్ హీరోగా మార్చేశాయి. ఇక ఈ రెండు సినిమాలు సాధించిన విజయాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే చాలా ప్రత్యేకంగా నిలిచాయనే చెప్పాలి. ‘పుష్ప 3’ సినిమా కూడా ఉంటుందని అనౌన్స్ చేసిన మేకర్స్ అది ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద సరైన క్లారిటి ఇవ్వలేదు. దాంతో పుష్ప 3 సినిమా చేస్తే అందులో రష్మిక మందాన హీరోయిన్ గా చేస్తుంది..

అనిమల్ పార్క్

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన అనిమల్ సినిమా 900 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. కాబట్టి పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ లేని సమయంలో అనిమల్ సినిమా విజయాన్ని సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీని సేవ్ చేసిందనే చెప్పాలి…ఇక ప్రస్తుతం సందీప్ ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా తర్వాత ఆయన అనిమల్ పార్క్ సినిమాని చేసే అవకాశాలైతే ఉన్నాయి…ఆ సినిమాలో గీతాంజలి’ అనే పాత్రను పోషించిన రష్మిక సెకండ్ పార్ట్ లో కూడా తన పాత్ర చాలా కీలకంగా మారబోతుందట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper