Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: నువ్వు నా ఫ్యామిలీ రా.. విజయ్ తో బంధాన్ని బయటపెట్టిన రష్మిక.. వైరల్...

Rashmika Mandanna: నువ్వు నా ఫ్యామిలీ రా.. విజయ్ తో బంధాన్ని బయటపెట్టిన రష్మిక.. వైరల్ వీడియో

Rashmika Mandanna: ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) గం గం గణేశా(Gam Gam Ganesha) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బేబీ వంటి భారీ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. గం గం గణేశా ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో జబర్దస్త్ ఇమ్మానుయేల్, బిగ్ బాస్ యావర్ కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఇమ్మానుయేల్, యావర్, ఆనంద్ దేవరకొండ మధ్య వచ్చే కామెడీ సీన్స్ హైలెట్ గా కనిపిస్తున్నాయి.

ఇక చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇమ్మానుయేల్ ఆనంద్ దేవరకొండను ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. ఇమ్మానుయేల్ అడిగే ప్రశ్నలకు ఆనంద్ దేవరకొండ తన స్టైల్ లో జవాబిచ్చాడు. ఈ క్రమంలో ఇమ్మానుయేల్ .. మీ అన్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), ఓ స్టార్ హీరోయిన్ ఒకే రిసార్ట్ కి వెళ్లినట్లు నా దగ్గర ఫోటో ఉంది. దీనిపై మీ సమాధానం ఏంటని అడిగాడు.

Also Read: Pushpa Team: కెజిఎఫ్ ఫార్మాట్ ఫాలో అవుతున్న పుష్ప టీమ్… పార్ట్ 3 ఉంది కానీ!

తప్పేముంది నా దగ్గర కూడా ఫోటో ఉంది అని చూపించాడు. అది కో ఇన్సిడెన్స్ అని చెప్పాడు. ఒకే రిసార్ట్ కి ఎలా వెళ్లారు అని ఇమ్మానుయేల్ అడగ్గా .. బాగా దూరం కదా ఫ్లైట్ లో వెళ్లారు అని చెప్పారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది అని ఇమ్మాన్యుయేల్ అడిగాడు. దీంతో ఆనంద్ దేవరకొండ సీక్రెట్ గా ఇక్కడ చెప్పొచ్చా అని అంటారు. వాళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ నడుస్తుంది అని తెలిపాడు.

Also Read: Tollywood Sequels: బాహుబలి నుంచి డీజే టిల్లు వరకు సిక్వెల్స్ సినిమాల పరిస్థితి ఏంటి..?

విజయ్ దేవరకొండ-రష్మిక మధ్య ఎఫైర్ నడుస్తుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. గం గం గణేశా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన రష్మికను ఆనంద్ దేవరకొండ.. నీ ఫేవరేట్ కో స్టార్ ఎవరని అడిగాడు. మైక్ దూరంగా పెట్టి ఏదో అన్న రష్మిక… అనంతరం అరే నువ్వు నా ఫ్యామిలీ రా… అని ఓపెన్ గా చెప్పింది. నేను నీకు వదినను అని రష్మిక విజయ్ దేవరకొండతో ఎఫైర్ ని కన్ఫర్మ్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. తర్వాత రౌడీ బాయ్ అని రష్మిక చెప్పింది. చిన్న రౌడీ అని చెప్పొచ్చుగా ఆనంద్ దేవరకొండ రిక్వెస్ట్ చేయడంతో, సరే చిన్న రౌడీ అని చెప్పింది. ఈ వీడియో వైరల్ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular