Rashmika Mandanna: తాజాగా హీరోయిన్ రష్మిక మండలం మూడు సినిమాలతో ఏకంగా మూడు వేల కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రష్మిక మందన తెలుగుతోపాటు హిందీ భాషలలో కూడా వరుసగా సినిమాలు చేస్తే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అయితే ఒక స్టార్ హీరోయిన్ రాక ఇప్పుడు రష్మిక మందన స్పీడ్ కు బ్రేకులు వేస్తుందని సామాజిక మాధ్యమాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈమె ఒక స్టార్ హీరోయిన్. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని టాప్ హీరొయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలో అమెరికాకు చెందిన ఫేమస్ సింగర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ చిన్నది తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటుంది. మళ్లీ చాలా రోజుల గ్యాప్ తర్వాత తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈమె మరెవరో కాదు గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. అమెరికాకు చెందిన ఫేమస్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని హాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా ఈ క్రమంలో దాదాపు ఎన్నో సినిమాలను వదులుకుంది. చాలా ఏళ్లుగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం రీఎంట్రీ ఇస్తుంది.
Also Read: రాజమౌళి ఆ విషయంలో బాగా హార్ట్ అయ్యాడా..?
ప్రస్తుతం ప్రియాంక చోప్రా దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా హిందీలో తెరకెక్కబోతున్న క్రిష్ 4 సినిమాలో కూడా ప్రియాంక చోప్రా నటించబోతుంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులగా తెలుగుతోపాటు హిందీ భాషలలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉంది. ఈ సమయంలోనే ప్రియాంక చోప్రా సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తుంది. రష్మిక మందన కెరియర్ గ్రాఫ్ పుష్ప 2, యానిమల్, చావా, సికందర్ వంటి సినిమాల తర్వాత చాలా వేగంగా పెరిగిందని తెలుస్తుంది.
ఈ క్రమంలో రష్మీకాకు హిందీలో మరికొన్ని ఆఫర్లు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరెక్ట్ గా ఈ సమయంలోనే ప్రియాంక చోప్రా సినిమాలలోకి రియంట్రీ ఇవ్వడం ఇక ఆమె ఓకే చెప్పిన రెండు సినిమాలు భారీ విజయం సాధిస్తాయి అనే భావిస్తున్నారు సినిమా విశ్లేషకులు. కొన్ని కథనాల ప్రకారం ప్రియాంక చోప్రా రాజమౌళి సినిమాకు మరియు క్రిష్ 4 సినిమాలకు భారీగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా ఏకంగా 30 కోట్లు మరియు క్రిష్ 4 సినిమా కోసం 20 కోట్లు పారితోషకం అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక మందాన స్పీడ్ కు బ్రేకులు పడతాయని అందరూ భావిస్తున్నారు.
Also Read: త్రివిక్రమ్ ను పక్కన పెడుతున్న తెలుగు హీరోలు…కారణం ఇదేనా..?