Rashmika Mandanna: ‘రష్మిక మండన్నా’లో హీరోయినే కాదు, ఓ చిలిపి పిల్ల కూడా ఉంది. అందుకే ఈ బ్యూటీలో ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు. నిజానికి రష్మికలో మంచి మ్యాటర్ ఉంది. పైగా తనకు వచ్చిన ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి అమ్మడు తెగ ప్రయత్నాలు చేస్తోంది. మొదట్లో నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకునేది. కానీ, వరుస హిట్లు వస్తుండటం.. పైగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వస్తుండటంతో రష్మిక రెమ్యునరేషన్ ను రెండింతలు పిచింది. సినిమాకి 3 కోట్లు అడుగుతుందట.

మొత్తానికి రష్మిక మాత్రం సినిమా ఇండస్ట్రీలో బాగా తెలివిమీరి పోయింది. సీనియర్ హీరోయిన్స్ కే సాధ్యం కానీ, టైంను టైమింగ్ ను రష్మిక సింపుల్ గా మ్యానేజ్ చేసుకుంటూ పోతుంది. పైగా ఏ ఇండస్ట్రీకి వెళ్తే.. ఆ ఇండస్ట్రీ పద్దతులను ఫాలో అవుతూ.. అక్కడ హీరోలను డైరెక్టర్లను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను అందుకుంటున్న హీరోయినన్స్ లో రష్మికనే ముందు ప్లేస్ లో ఉంది. ఎలాగూ ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది. కారణం బాలీవుడ్ లో రష్మిక ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది.
Also Read: ఆ డెరెక్టర్ వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టిన ప్రముఖ హీరోయిన్..!
అందుకే ఎక్కువగా ముంబైలోనే ఉంటూ అక్కడ స్టార్ హీరోలను రెగ్యులర్ గా కలుస్తూ బిగ్ ఛాన్స్ ల కోసం తన వంతుగా కొన్ని కసరత్తులు, ప్రయత్నాలు చేస్తోంది. అయితే, బాలీవుడ్ భామలు అందాల ప్రదర్శనలో ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు. దాంతో అక్కడి పద్దతికి తగ్గట్లు మేకోవర్ అయిపోయింది రష్మిక. బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తన గ్లామర్ షోతో కుర్రకారుని మరింతగా ఆకట్టుకుంటూ, నిత్యం జిమ్ కి వెళ్తూ అక్కడి ఫొటోగ్రాఫర్లకు పని చెబుతూ వారి ముందు టిప్ టాప్ గా రెడీ అవుతుందట.
మొత్తానికి రష్మికను చూసి, కొత్త భామ కృతి శెట్టి కూడా రష్మికనే ఫాలో అయిపోతుంది. రష్మిక ఎలా అయితే తన కెరీర్ ను మలుచుకుందో సేమ్ అలాగే కృతి శెట్టి కూడా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. రష్మిక బాలీవుడ్ లో చేస్తోన్న చేష్టలు పసిగట్టి, కృతి శెట్టి టాలీవుడ్ లో వాటిని అమలు పరుస్తోంది.
ఈ క్రమంలోనే కృతి శెట్టి కొత్త మేకోవర్ చేయించుకొని మెల్లగా గ్లామర్ రూట్లోకి వచ్చి, అందాల ప్రదర్శనకు తేరా తీసింది. ఏది ఏమైనా రష్మిక కొత్త భామలకు ఆదర్శంగా నిలవడం విశేషమే.
Also Read: ‘పూజా హెగ్డే’ స్పెషల్ వీడియో.. నిషా అగర్వాల్ వర్కౌట్లు !