Vijay Devarakonda- Rashmika Mandanna: రష్మిక మందాన-విజయ్ దేవరకొండ ఎఫైర్ అంటూ పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. ఒకటి రెండు సందర్భాల్లో ఈ జంట ఖండించారు కూడా. అయితే రూమర్స్ మాత్రం ఆగడం లేదు. దానికి కారణం తరచుగా ఈ జంట కలిసి కనిపించడమే. ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ పలుమార్లు వీరిద్దరూ కనిపించారు. ఇక విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే బర్త్ డే పార్టీలు, స్పెషల్ ఈవెంట్స్ కి రష్మిక హాజరవుతారు. విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండే ఆ వేడుకల్లో పరిశ్రమకు చెందిన రష్మిక ఒక్కరే కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రష్మికతో ఎఫైర్ పెట్టుకున్నారని వచ్చే వార్తలను రౌడీ హీరో తనదైన శైలిలో ఖండించారు. పరుష పదజాలంతో మీడియా కథనాలకు గతంలో రిప్లై ఇచ్చాడు. ఇది ఎవర్ గ్రీన్ టాపిక్ గా మారిపోయిన క్రమంలో ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతిసారీ ఈ జంటకు ఈ ప్రశ్న ఎదురవుతుంది. లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండను కూడా బాలీవుడ్ మీడియా అడగడం జరిగింది. తాజాగా ‘గుడ్ బై’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మికను మీడియా విజయ్ దేవరకొండతో ఉన్న సంబంధం ఏమిటని అడగడం జరిగింది.
దానికి రష్మిక చాలా సింపుల్ గా సమాధానం చెప్పారు. ఆమె ఎలాంటి అసహనానికి, కోపానికి గురి కాలేదు. మేము కలిసి రెండు చిత్రాలు చేశాం. అప్పటి నుండే ఈ పుకార్లు మొదలయ్యాయి. కలిసి నటిస్తున్న క్రమంలో నటులు స్నేహితులుగా మారతారు. నాకు హైదరాబాద్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే అక్కడ విజయ్ దేవరకొండకు ఓ గ్యాంగ్ ఉంది. ఇద్దరం కెరీర్ లో త్వరగా ఎదిగాము. మా మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు చూస్తుంటే చాలా క్యూట్ గా ఉన్నాయి అనిపిస్తుంది. ఈ రూమర్స్ మేము పట్టించుకోము. మేమిద్దరం మంచి నటులం. కథ దొరికితే మళ్ళీ ఇద్దరం కలిసి నటిస్తాము. దర్శక నిర్మాతలను నిరాశపరచకుండా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తామంటూ.. రష్మీకి చెప్పుకొచ్చారు.

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది. డబుల్ ప్రాఫిట్స్ పంచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఓ భారీ మూవీ వసూళ్లు ఆ చిత్రానికి దక్కాయి. గీత గోవిందం రష్మిక, విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా ఉపయోగపడింది. తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ మూవీ చేశారు. ఆ మూవీ అంతగా ఆడలేదు. అయితే రష్మిక-విజయ్ మధ్య కెమిస్ట్రీ హైలెట్ అయ్యింది. ఇద్దరూ లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. డియర్ కామ్రేడ్ మూవీ సమయం నుండి రష్మిక-విజయ్ దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం, తరచుగా కలుసుకోవడం చేస్తున్నారు. అయితే గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. ఆయనతో రష్మికకు నిశ్చితార్థం కూడా జరిగింది. రష్మిక కెరీర్ కోసం రక్షిత్ కి బ్రేకప్ చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఆ నిర్ణయం రష్మిక జీవితాన్నే మార్చేసింది. స్టార్ గా ఎదిగి సరైన సమయంలో రైట్ డెసిషన్ తీసుకున్నారని నిరూపించుకున్నారు.