Rashmika Mandanna: ఏమైనా విజయ్ దేవరకొండదే అదృష్టం అంటున్నారు నెటిజెన్స్. నేషనల్ క్రష్ రష్మిక మందానతో రిలేషన్ ఎంజాయ్ చేస్తున్నాడంటూ నొచ్చుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మాల్దీవ్స్ టూర్ లో ఉన్నారు. అక్కడ ఏకాంతంగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవ్స్ అంటే అందమైన సాగర తీరానికి పెట్టింది పేరు. అక్కడి సముద్ర అలల్లో, స్విమ్మింగ్ ఫూల్స్ లో ఈత కొట్టడం పెద్ద సరదా. అందుకే మాల్దీవ్స్ వెళ్లిన హీరోయిన్స్ ఆ ముచ్చట తీర్చుకుంటారు.

మరి స్విమ్మింగ్ అంటే బికినీ కామన్ కదా… రష్మిక సైతం టు పీస్ హాట్ బికినీ ధరించారు. బికినీలో ఉన్న రష్మిక తన వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. రష్మిక ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆ అదృష్టం అంతా విజయ్ దేవరకొండదే అని నొచ్చుకుంటున్నారు. రష్మికను బికినీలో చూసే, ఫోటోలు తీసే అదృష్టం విజయ్ దేవరకొండదేగా అంటూ ఈర్ష్య పడుతున్నారు.

బయటకు చెప్పకున్నా ఒప్పుకోకున్నా విజయ్-రష్మిక మధ్య స్నేహానికి మించిన రిలేషన్ నడుస్తుందనేది నిజం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చు. కానీ ఒకవైపు లవ్ రూమర్స్ ఖండిస్తూనే ఇలా ఏకాంతంగా ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేకుండా ఇద్దరే రొమాంటిక్ టూర్ కి వెళ్లడాన్ని ఏమనాలని వాళ్ళను జనాలు ప్రశ్నిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రష్మిక-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రెండు చిత్రాలు విడుదలయ్యాయి. దర్శకుడు పరుశురాం తెరకెక్కించిన గీత గోవిందం డబుల్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. ఈ మూవీ ఓ స్టార్ హీరో రేంజ్ షేర్ రాబట్టింది. రెండో చిత్రంగా డియర్ కామ్రేడ్ చేశారు. ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడకున్నా రష్మిక, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ వెండితెరపై పండింది. ఈ మూవీలో లిప్ లాక్స్ తో రెచ్చిపోయారిద్దరూ. అప్పుడే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయినట్లు సమాచారం.