Vijayasai Reddy: విశాఖలో విజయసాయిరెడ్డి భూ దందా పక్కా ఆధారాలతో బయటపడుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల పల్లవి అందుకుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించింది. అయితే అందుకు తగ్గట్టుగా విశాఖలో పట్టుబిగించేందుకు ఉత్తరాంధ్ర సమన్వయకర్తంగా ఎంపీ విజయసాయిరెడ్డి ని నియమించింది. విశాఖలోనే మకాం వేసిన ఈ వైసీపీ నేత పార్టీ వ్యవహారాలన్ని చక్కబెట్టారు. అయితే నగరపాలక సంస్థ ఎన్నికల తరువాత విజయసాయిరెడ్డిని జగన్ పదవి నుంచి తొలగించారు. ఆ స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. అప్పట్లో విజయసాయిరెడ్డిపై భూకబ్జా ఆరోపణలు రావడం వల్లే ఆయనకు స్థాన చలనం కల్పించారన్న టాక్ నడిచింది. అయితే తరువాత ఎందుకో ఆ అంశం సైలెంట్ అయ్యింది.

అయితే విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించినా.. ఆయనకు విశాఖ పై మమకారం మాత్రం తగ్గలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన విశాఖ కు చుట్టం చూపుగా వచ్చి వెళుతున్నారు. కానీ విశాఖలో నివాసముంటున్న అల్లుడు, కుమార్తెను చూసేందుకు వెళుతున్నారని అంతా అనుకున్నారు. కానీ సుమారు రూ.400 కోట్లు విలువైన ఆస్తులను పోగేసుకున్నారని తాజాగా టాక్ వినిపిస్తోంది. అయితే విజయసాయిరెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యుల అవినీతిని విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. తాజాగా ఆయన గీతం యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఆరు ఎకరాల భూమి విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె ఆధీనంలోకి ఎలా వచ్చింది ఫుల్ ఎవిడెన్స్ ను ప్రజల ముందుంచారు.
వైసీపీ అధికాంలోకి వచ్చిన తొలినాళ్లలో విశాఖలోని ప్రముఖ గీతంయూనివర్సిటీపై ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతకాదు. ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నారని.. పదుల సంఖ్యలో జేసీబీలతో ప్రహరీని తొలగించిన సంగతి తెలిసిందే. అయితే గీతం యూనివర్సిటీలో ఇంకా చాలావరకూ ప్రభుత్వ భూమి ఉందని.. వాటిని స్వాధీనం చేసుకోనున్నట్టు సాక్షిలో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. అయితే తరువాత సైలెంట్ అయ్యారు. కానీ అప్పట్లో గీతం యూనివర్సిటీ భరత్ బాబాయ్ భరద్వజ్ కు చెందిన ఆరు ఎకరాల ఖరీదైన భూములు విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె కంపెనీ పేరిట మారిపోయాయి.

సంబంధిత డాక్యుమెంట్లను మూర్తి యాదవ్ విలేఖర్లకు చూపించారు. గీతం యజమాని భరత్ టీడీపీ కీలక నేతల బాలక్రిష్ణ అల్లుడు. అటువంటి వారినే భయపెట్టి భూములు తమ పేరిట రాయించుకుంటే.. సామాన్యులు ఒక లెక్క అని మూర్తియాదవ్ ప్రశ్నిస్తున్నారు. ఇవి ఇప్పుడు విశాఖ జనాలను ఆలోచింపజేస్తున్నాయి. విశాఖలో వైసీపీ నేతల భూదందాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని జనసేనాని ఆరోపణలుచేస్తున్న తరుణంలో మూర్తి యాదవ్ పోరాటం అందర్నీ ఆకట్టుకుంటోంది.