Rashmika Mandanna: రష్మిక…నేషనల్ క్రష్మిక కావొచ్చు. ఆమె చేతినిండా సినిమాలు ఉండవచ్చు. యంగ్ హీరోలకు ఫస్ట్ ఆప్షన్ కావచ్చు. కానీ, ఆమె నోటి తీట నిర్మాతలకు తీవ్ర నష్టాలు తెచ్చిపెడుతోంది. అంతేకాదు ఆమె సొంత ఇండస్ట్రీ శాండల్ వుడ్ కు దూరమవుతోంది. ప్రత్యేకించి ఆ కాంతార దర్శకుడు రిషబ్ శెట్టితో ఆమె పిచ్చి గొడవ, ఇద్దరూ గోక్కోవడం అల్టిమేట్ గా ఆమెకే నష్టం చేకూర్చుతోంది.. ఆ సోయి కూడా రష్మికలో కనిపించడం లేదు. ఒక దశలో కన్నడ ఎగ్జిబిటర్లు కూడా ఆమె మీద కోపంతో తాజా సినిమా వారసుడిని ప్రదర్శించకూడదని అనుకున్నారు.. మధ్యలో దిల్ రాజు రాయబారం నడపడంతో కథ సుఖాంతమైంది.. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.. దెబ్బకు దిల్ రాజుకు వాచిపోయింది.

కిరాక్ పార్టీ సమయం నుంచీ ఆమెకు పలు సందర్భాల్లో కిచ్చా సుదీప అండగా నిలబడ్డాడు.. దీంతో ఎగ్జిబిటర్లు మొక్కుబడిగా ఆమె మీద నిషేధం వంటి తీవ్ర నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ఈ సినిమా కొన్న బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు సత్సంబంధాలు ఉండటం మరో కారణం.. అయినప్పటికీ సరే వారికి లో లోపల ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు అని భయం వణికిస్తూనే ఉంది.. ఆ భయమే నిజమైంది.. ప్రేక్షకులు ఆ సినిమాను లైట్ తీసుకున్నారు.. ఈ మధ్య కన్నడ ప్రేక్షకులకు ఇండస్ట్రీ మీద అఫెక్షన్ బాగా పెరిగి, కన్నడ సినిమా మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు. సో రష్మిక నోటి తీట విజయ్ సినిమాకు చేటు తెచ్చింది. దిల్ రాజుకు చుక్కలు చూపించింది.. ఈ సినిమా జనవరి 11న విడుదలైంది.. అసలు సినిమా మీద మంచి టాక్ రాలేదు. కాకపోతే విజయ్ స్టార్ డం కారణంగా తమిళనాడులో వసూళ్లు బాగానే ఉన్నాయి. కానీ ఆ ప్రేమ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో ఉండాలని ఏముంది? అందుకే మూడు రాష్ట్రాల్లోనూ ఫట్ అయింది.. మలయాళం సంగతి కూడా ఇలానే ఉందని టాక్. రష్మిక నోటి తీట కారణంగా కనీసం 300 షోలు రద్దు చేసుకోవాల్సి వచ్చిందని కన్నడ మీడియా చెబుతోంది. ఎన్ని షోలు, ఎంత నష్టం అనేది కాదు ఇక్కడ చూడాల్సింది… రష్మిక పోగు చేసుకుంటున్న వ్యతిరేకత గురించి..
కన్నడ మీడియా కథనం ప్రకారం మొదటి రోజు ఈ సినిమా స్క్రీనింగ్ 757… మరుసటి రోజు ఆ సంఖ్య 466 కు పడిపోయింది.. ఆ తర్వాత రోజుల్లో నేలచూపులు చూసింది. ఇక ఈ సినిమా కన్నడ నాట లేచే పరిస్థితి లేదు. దాదాపు ఎత్తిపోయినట్టే. అయితే ఈ నష్టానికి కారణం రష్మిక కాకపోవచ్చు. పాక్షిక కారణం కావచ్చు. సినిమా మౌత్ టాక్ సరిగ్గా లేకపోవడం మరో కారణం కావచ్చు. అయితేనేం, గాలి దుమారం మొత్తం రష్మిక మీదకు లోకల్ మీడియా డైవర్ట్ చేస్తోంది.. అసలే ఇప్పుడు అక్కడ రక్షిత్ శెట్టి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మీడియా కూడా ఆయన మాట వింటున్నది. పాపం రష్మిక!
రష్మిక తో గత వ్యవహారంలో రిషబ్ శెట్టి స్పందన, ప్రవర్తన కూడా సరిగ్గా లేవు. హుందాగా లేదు.. రష్మిక మనసులో ఏదో నొప్పి ఉంది. ఆమె దాచుకోకుండా బయటికి వ్యక్తికరిస్తోంది.. పోనీ ఆమె తింగరి అనుకుందాం.. మరి రిషబ్ శెట్టి పెద్దరికం ఏమైనట్టు? మిగతా చిత్ర పరిశ్రమల్లో ఇలాంటి చిల్లర పంచాయితీలు త్వరగానే సెటిల్ అవుతాయి. కానీ, కన్నడకు ఆ దిక్కు లేనట్టుంది.
ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలు ఉన్నాయి.. కానీ ఇలాంటి రష్మికలను సినిమా పరిశ్రమ చాలా మందిని చూసింది. ఇకపై చూస్తూనే ఉంటుంది.. ఇవాళ చేతినిండా సినిమాలు ఉన్న రష్మిక రేపటి నాడు ఇలాగే ఉండాలని లేదు. అలాంటప్పుడు మళ్లీ కన్నడ ఇండస్ట్రీయే తల్లిలా ఒడిలోకి తీసుకుంటుంది. ఆ నిజం ఆమెకు అర్థం కావడం లేదు. కొన్ని కొన్ని సార్లు ఆ విజయ్ దేవరకొండ లాగే తిక్క తిక్కగా మాట్లాడుతోంది. మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీలో ఇలాంటివి వర్కౌట్ అవ్వవు. ఆ నోటి తీటను తగ్గించుకోలేనంత కాలం ఆమెను కన్నడ దగ్గరకు తీయదు. చివరకు వేణు స్వామి తో ఎన్ని నష్ట నివారణ పూజలు చేయించుకున్నా సరే!