Rajamouli And Prabhas: ప్రభాస్(Rebel Star Prabhas) లైనప్ చూస్తుంటే మరో మూడేళ్ళ వరకు కొత్త సినిమాకు ఒప్పుకోవడం కష్టం అనిపిస్తోంది. రాజాసాబ్(Rajasaab Movie) మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి తో చేస్తున్న ‘ఫౌజీ’ కూడా పూర్తి చెయ్యాలి. ఈ రెండు చిత్రాలు పూర్తి అయ్యాక మార్చ్ నెల నుండి ఆయన సందీప్ వంగ తెరకెక్కించే ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మెక్సికో లో మొదటి షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రం పూర్తి అయ్యాక ప్రశాంత్ వర్మ తో మరో సినిమా కమిట్ అయిన ప్రభాస్ కల్కి 2, సలార్ 2 చిత్రాలు కూడా పూర్తి చెయ్యాలి. వీటి తర్వాత ప్రభాస్ రాజమౌళి(SS Rajamouli) తో మరో సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే ఈసారి బాహుబలి తరహా సినిమా కాదు, బాక్సింగ్ నేపథ్యం కథ తో తెరకెక్కిస్తాడు అట.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ ‘ఛత్రపతి, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ తో నేను బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథతో సినిమా చేయాలనీ అనుకుంటున్నాను. నేను భవిష్యత్తులో ప్రభాస్ తో సినిమా చేస్తే బాక్సింగ్ నేపథ్యం లోనే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. బాక్సింగ్ నేపథ్యం లో ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ‘తమ్ముడు’,’అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ మరియు ‘గని’ వంటి చిత్రాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్ అని చెప్పొచ్చు. ఆరోజుల్లో ఇలాంటి సినిమాలు మన తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. కొత్తగా అనిపించడం, ఎంటర్టైన్మెంట్ ఉండడం తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. అయితే అప్పటి ట్రెండ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ వేరు. బాక్సింగ్ నేపథ్యం లో ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమా చేస్తే జనాలు అంగీకరిస్తారా అనే అనుమానం ఫ్యాన్స్ లో ఉంది.
ఎందుకంటే ప్రభాస్ ఇమేజ్ అలాంటి నేపథ్యం ఉన్న సినిమాలకంటే చాలా పెద్దది. చేస్తే లార్జర్ థెన్ లైఫ్ రోల్స్ మాత్రమే చెయ్యాలి. అది కూడా రాజమౌళి లాంటి డైరెక్టర్ తో చేస్తున్నాడంటే బాహుబలి ని మించి ఉండాలి. లేదంటే పరిస్థితి తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ ఈమధ్య కాలం లో సినిమాని సినిమాలాగే చూడడం మొదలు పెట్టారు ఆడియన్స్. కాబట్టి ఈ సినిమాని కూడా అదే దృష్టితో చూస్తారని, కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టే రేంజ్ లోనే తీస్తారని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి అనేది.