Rashmika Mandanna : యానిమల్ మూవీతో రష్మిక మందన్న బాలీవుడ్ లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రష్మిక లీడ్ రోల్ హీరోయిన్ గా నటించింది. యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో సౌత్ బ్యూటీ రష్మికకు బాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అనూహ్యంగా బాలీవుడ్ బడా స్టార్స్ సరసన నటించే అవకాశాలు దక్కుతున్నాయి.
తాజాగా రష్మిక మందన ఓ క్రేజీ ఆఫర్ పట్టేసింది. బాలీవుడ్ ఖాన్ త్రయం లో ఒకరైన హీరో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సల్మాన్ కాంబోలో ‘ సికందర్ ‘ అనే టైటిల్ తో సినిమా రాబోతుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపికైనట్లు సమాచారం అందుతుంది.
సికందర్ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. తమిళ స్టార్ హీరో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ కుబేర ‘ సినిమాలో రష్మిక నటిస్తుంది. రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మరోసారి రష్మిక జతకట్టనుందని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీతో రష్మిక బిజీగా ఉంది. ఈ మూవీలో శ్రీవల్లిగా మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దమవుతుంది. పుష్ప 2021 లో విడుదలై భారీ విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై తార స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది.