Pushpa 3 : పుష్ప 2 సినిమా ప్రస్తుతం పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా ఈ సినిమాతో సుకుమార్ దర్శకత్వ ప్రతిభ కూడా చాలా బాగా ఎలివేట్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఎలివేషన్స్ ఎమోషన్స్ తారాస్థాయిలో ఉండడమే కాకుండా అల్లు అర్జున్ ని చూపించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉందని సుకుమార్ కి చాలా ప్రశంసలైతే దక్కుతున్నాయి. దాంతో పాటుగా సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లిన అల్లు అర్జున్ కు కూడా మరొకసారి ‘నేషనల్ అవార్డు’ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా దీనికి కొనసాగింపు ‘పుష్ప 3 ర్యాంపేజ్’ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ను అందుకొని బాక్సాఫీస్ మీద తన పంజా దెబ్బను రుచి చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇక రీసెంట్ గా రష్మిక మందాన ను కూడా ఇదే క్వశ్చన్ అడగగా తనకు సినిమా యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.
కానీ తాను కూడా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ వార్తను వింటున్నానని చెప్పారు. అయితే సుకుమార్ గారికి ట్విస్ట్ ఇవ్వడం అలవాటే కాబట్టి అతను ఉంటే ఉండొచ్చు అనే ధోరణిలో మాట్లాడారు. ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ పుష్ప 3 సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక విజయ్ కనక పుష్ప 3 సినిమాలో ఉన్నట్లైతే పుష్ప 3 మూవీ దాదాపు ఇండస్ట్రీ హిట్టు కొట్టడం పక్క అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఇంతకుముందు కూడా విజయ్ దేవరకొండ పుష్ప 3 ర్యాంపేజ్ మీద ఒక ట్వీట్ అయితే చేశారు.
మరి తను అందులో బాగామవ్వబోతున్నాడా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఈ సినిమా మరో రెండు సంవత్సరాల తర్వాత సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతానికి సుకుమార్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కమిట్ అయిన కమిట్మెంట్లను పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా మీద దృష్టి సారించబోతున్నట్టుగా తెలుస్తోంది