spot_img
Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna world record actress: ప్రపంచంలోనే తొలి ఇండియన్ నటిగా నిల్చిన రష్మిక..నమోదైన అరుదైన...

Rashmika Mandanna world record actress: ప్రపంచంలోనే తొలి ఇండియన్ నటిగా నిల్చిన రష్మిక..నమోదైన అరుదైన రికార్డు..

Rashmika Mandanna world record actress: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ స్థాయి నుండి, పాన్ ఇండియన్ హీరోయిన్ గా ఎదిగి, కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ గా, నేషనల్ క్రష్ గా రష్మిక(Rashmika Mandanna) కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందం తోనే కాకుండా , తన అద్భుతమైన నటనతో , ప్రతీ సినిమాతో ఆమె తన ఇమేజ్ ని పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు ఆమె కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జపాన్ లోని టోక్యో మహానగరం లో ప్రతీ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘క్రాంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026’ (Crunchyroll Anime Awards 2026) కి ప్రెజెంటర్ గా ఎంపిక అయ్యింది.

సినీ ప్రపంచం లో ఆస్కార్ అవార్డ్స్ కి ఎంతటి ప్రత్యేకత ఉందో, యానిమే ప్రపంచం లో ఈ అవార్డ్స్ కి ఆ స్థాయి ప్రత్యేకత ఉంది. 2024 వ సంవత్సరం లో కూడా రష్మిక ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొని యానిమే లవర్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇప్పుడు వరుసగా రెండవసారి ఆమె ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ కి ఆహ్వానం అందుకోవడం అనేది నిజంగా మన టాలీవుడ్ కి ఎంతో గర్వ కారణం అని చెప్పొచ్చు. ఈ ఏడాది మే 23న ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఫంక్షన్ టోక్యో మహానగరం లో జరగనుంది. ఈ వేడుకకు హాలీవుడ్ దిగ్గజాలు కూడా హాజరు కాబోతున్నారు. వాళ్ళ మధ్య మన రష్మిక ని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. ఇక ఆమె అభిమానులకు ఏ రేంజ్ ఫీలింగ్ ఉంటుందో మీరే ఊహించుకోండి. జపాన్ లో యానిమే సంస్కృతి కి ఎంతో క్రేజ్ ఉంది.

Also Read: రామ్ చరణ్ తో పోటీ పడే హీరోలు వీళ్లే…

ముఖ్యంగా ‘నరుటో’ అనే యానిమే క్యారెక్టర్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ సాధారమైనది కాదు , మన ఇండియా లో కూడా కోట్ల మంది ఈ క్యారెక్టర్ ని విపరీతంగా ఇష్టపడుతుంటారు. వారిలో రష్మిక కూడా ఒకరు. గతం లో ఆమె ఈ ‘నరుటో’ యానిమే క్యారక్టర్ పై సోషల్ మీడియా లో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. జాపనీస్ ఆ వీడియోస్ ని ఎగబడి చూశారు. అంతే కాకుండా రీసెంట్ గానే ఆమె హీరోయిన్ గా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం జపాన్ లో విడుదలై పెద్ద సంచలన విజయం సాధించింది. ఈ రెండు కారణాల చేత ఆమెకు జపాన్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజే నేడు ఆమెని ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఫంక్షన్ లో రెండవసారి కూడా పాల్గొనబోయేలా చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version