Pushpa 2: రష్మిక మందాన పుట్టినరోజు పురస్కరించుకొని పుష్ప 2 నుంచి ఆమె లుక్ విడుదల చేశారు. సదరు లుక్ ఆసక్తి రేపుతోంది. పుష్ప 2లో రష్మిక పాత్రపై అంచనాలు పెంచేసింది. రష్మిక మందాన నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్. అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన పుష్ప వరల్డ్ వైడ్ రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
పుష్ప సిరీస్లో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం చెట్లు నరికే కూలీగా వెళ్లిన పుష్ప… ఆ స్మగ్లింగ్ మాఫియాకే హెడ్ గా ఎదుగుతాడు. పుష్ప పార్ట్ 1లో రష్మిక మందాన చేసిన శ్రీవల్లి, డీగ్లామర్ రోల్. పాలు అమ్ముకునే అమ్మాయిగా చాలా సింపుల్ గా ఉంటుంది. రెడ్ శాండల్ స్మగ్లింగ్ డాన్ పుష్ప రాజ్ ని పెళ్లి చేసుకున్న శ్రీవల్లి గెటప్ సెటప్ మార్చేసింది.
ఇది తెలియజేసేలా పుష్ప 2 నుండి రష్మిక మందాన లుక్ ఉంది. పేద అమ్మాయి కాస్త డాన్ భార్యగా మారింది. ఈ క్రమంలో పట్టు చీర, ఒంటి నిండా నగలతో రష్మిక మందాననను పరిచయం చేశారు. పాలు అమ్ముకునే శ్రీవల్లి పట్టు చీరలో సరికొత్తగా ఉంది. మొత్తంగా రష్మిక ఫస్ట్ లుక్ అదిరింది. పుష్ప 2 ఆగస్టు 15న ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దాదాపు వెయ్యి కోట్లు టార్గెట్ గా పుష్ప 2 విడుదల అవుతుంది.
పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు రష్మిక మందాన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. గత ఏడాది యానిమల్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కింది. కాగా పుష్ప 2తో పాటు రష్మిక రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ టైటిల్స్ తో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది.
Our ‘Srivalli’ says 3 more days to witness #Pushpa2TheRuleTeaser
Get ready for goosebumps stuff on April 8th #PushpaMassJaathara#Pushpa2TheRule pic.twitter.com/X7kq6870qS
— Pushpa (@PushpaMovie) April 5, 2024