Rashmika Mandanna And Vijay Deverakonda: నేషనల్ వైడ్ గా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్స్ లో ఒకటి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందాన(Rashmika Mandanna) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం. గత ఐదేళ్ల నుండి ఈ వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది. ఆ సమయం లో విజయ్ దేవరకొండ అసలు నిజం కాదు, పనిపాట లేని వాళ్ళు పుట్టించే పుకార్లు అంటూ సోషల్ మీడియా లో కొట్టిపారేసేవాడు. కానీ అదే నిజమని ఆధారాలతో సహా ఎన్నో సార్లు బయటపడింది. ఇక అప్పటి నుండి ఈ వార్తలపై స్పందించడం మానేసాడు. అయితే గత ఏడాది వీళ్లిద్దరు పెద్దల సమక్ష్యం లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. సినీ సెలబ్రిటీలు ఎంత గోప్యంగా ఉంచినా రహస్యాలు దాగవు, అది కూడా ఈ సోషల్ మీడియా యుగంలో. వీళ్లిద్దరి నిశ్చితార్థం వ్యవహారం కూడా అలాగే సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.
వచ్చే నెలలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే టాక్ ఉంది. కనీసం అప్పుడైనా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టి కోరుకుంటారో లేదో చూడాలి. గత రెండేళ్ల నుండి రష్మిక హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది. అందుకు తగిన ఆధారాలు సోషల్ మీడియా లో ఎన్నో లీక్ అయ్యాయి. రీసెంట్ గా వీళ్లిద్దరు ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలను చూస్తే, వీళ్ళింకా ఒకే ఇంట్లో ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. వీళ్లిద్దరు ఒకే సోఫా లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. యాష్ రంగులో ఉన్న సోఫా లో విజయ్ దేవరకొండ హాయిగా పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే సోఫా లో వేరే సమయం లో రష్మిక ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది.
ఆ సోఫా లో ఉన్నటువంటి దిండు రంగు కూడా ఒకేలా ఉండడం తో, ఇంత అడ్డంగా దొరికిపోయారేంటి ఈ ప్రేమికులు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీళ్లిద్దరి సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే రష్మిక గర్ల్ ఫ్రెండ్ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. మరో పక్క విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం తో ఫ్లాప్ ని అందుకున్నాడు. కెరీర్ పరంగా ఒకరు ఎవ్వరూ అందుకోలేనంత రేంజ్ లో ఉంటే, మరొకరు మాత్రం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడి ఉన్నారు. మరి వీళ్లిద్దరి కలయిక తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ లో ఏమైనా మార్పులు వస్తాయో లేదో చూడాలి.