Sreeleela: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నటి శ్రీలీల(SreeLeela). అప్పట్లో ‘ఏ మాయ చేశావే’ సినిమాతో సమంత కూడా ఇలాగే మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. మళ్లీ ఈ రేంజ్ లో ఎవ్వరూ రాలేరని అనుకున్నారు. కానీ శ్రీలీల ఆ రికార్డు ని బ్రేక్ చేసింది. ‘పెళ్లి సందడి’ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అందం, డ్యాన్స్ చూసి కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. సాయి పల్లవి రేంజ్ లో ఈమె కల్ట్ ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈమె ఎంచుకునే స్క్రిప్ట్స్ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. వరుసగా ఫ్లాప్స్ వస్తూనే ఉన్నాయి. కెరీర్ మొత్తం మీద ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల్లో పెళ్లి సందడి, ధమాకా మరియు భగవంత్ కేసరి మాత్రమే సూపర్ హిట్స్ గా నిలిచాయి.
సెంట్ గా విడుదలైన ‘మాస్ జాతర’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక ఈమె హీరోయిన్ గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, ఈ సమ్మర్ కి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీల కెరీర్ మళ్లీ గాడిలో పడినట్టే. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీ పెళ్లి ఎప్పుడు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు శ్రీలీల సమాధానం చెప్తూ ‘నా వయస్సు ప్రస్తుతం 24 ఏళ్ళు. 30 ఏళ్ళు వచ్చే వరకు నేను పెళ్లి గురించి ఆలోచించను, కాబట్టి అబ్బాయిల గురించి ఆలోచించే ఓపిక, తీరిక నాకు లేదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, నేను ప్రేమలో పడ్డానని సోషల్ మీడియా లో అనేక రూమర్స్ వచ్చాయి. నేను ఎక్కడికి వెళ్లినా నాతో పాటు మా అమ్మ వస్తుంది. అలాంటప్పుడు నేను రిలేషన్ లో ఉన్నాను అంటే ఎలా నమ్ముతారు?’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.