Naga Vamsi And Meenakshi Chaudhary: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేర్లలో ఒకటి నాగవంశీ(Nagavamsi). నిర్మాతే అయినప్పటికీ యూత్ కి బాగా దగ్గరయ్యే భాషతో, యాటిట్యూడ్ చింటూ అని పిలిపించుకుంటూ ఉంటాడు. గత ఏడాది మనోడికి ఫస్ట్ హాఫ్ బాగా కలిసి రాగా, సెకండ్ హాఫ్ మాత్రం భారీ నష్టాలను మిగిలించింది. అంతే కాకుండా ‘వార్ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నోరు జారీ మాట్లాడిన కొన్ని మాటల కారణంగా తీవ్రమైన ట్రోల్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. ఒక నిర్మాతపై ఈ రేంజ్ ట్రోల్స్ హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో ఎవ్వరూ చూడబోరు కూడా, ఒక్క నాగవంశీ తప్ప అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు ఉదయం ఒక లాంచ్ ఈవెంట్ ద్వారా విడుదల చేశారు. ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో చేశారు. ట్రైలర్ ప్రదర్శిస్తున్న సమయం లో నాగవంశీ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చాలా కోపం తో ఫోన్ ఎత్తుతాడు. ఎత్తిన తర్వాత కోపంతో ఊగిపోతూ పెద్దగా అరుస్తాడు. పక్కనే ఉన్న హీరో నవీన్ పోలిశెట్టి ఏమైంది అని నాగవంశీ వైపు చూడగా, మీనాక్షి చౌదరి మాత్రం బిత్తరపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నాగవంశీ ఎవరి మీద అంత కోపం చూపిస్తున్నాడు?, ఎవరైనా ఆయన్ని తీవ్రంగా విసిగిస్తున్నారా?, లేదా ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేయలేకపోతున్నందుకు అలా మండిపడుతున్నాడా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఇలా నాగవంశీ నుండి సోషల్ మీడియా లో మీమర్స్ కి ఎదో ఒక మేము కంటెంట్ వస్తూనే ఉంటుంది. రేపటి నుండి ఈ వీడియో ని ఎంతమంది మీమ్స్ గా ఉపయోగిస్తారో చూడండి. ఇకపోతే నేడు విడుదల చేసిన ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పండగ కోసమే ఈ చిత్రాన్ని తీసినట్టుగా ఉన్నారంటూ సోషల్ మీడియా లో ఈ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ టైమింగ్ పంచులు చాలా బాగా అనిపించాయి. కాబట్టి ఈ సంక్రాంతికి కచ్చితంగా ఈ సినిమా వర్కౌట్ అయ్యేలాగానే అనిపిస్తుంది. కానీ ఆడియన్స్ కి మొదటి రెండు ఛాయస్ లుగా ‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలు ఉంటాయి. ఈ రెండు సినిమాలకు టాక్ కాస్త అటు ఇటు అయితే ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి కలిసి రావొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు .
ఫోన్ లో ఎవరి మీద నాగవంశీ ఫైర్ అవుతున్నారు..?
#AnaganagaOkaraju #NaveenPolishetty #NagaVamsi pic.twitter.com/DcndX8fLCs
— YK Tv Entertainment (@YKTvEnt) January 8, 2026