Rashmika Mandanna
Rashmika Mandanna : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇండస్ట్రీలో హీరోలకి ఒకటి రెండు సినిమాలతో మంచి గుర్తింపు వస్తే హీరోయిన్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారైంది. ఎన్ని సినిమాలు చేసిన కూడా సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చినంత వరకే వాళ్లకు క్రేజ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. హీరోలు చేసే చాలా సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ఉంటాయి. ఇక హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్ల కెరీర్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. ఎందుకంటే వాళ్లకు రెండు మూడు సినిమాలతో సక్సెస్ లు వచ్చినప్పటికి ఒక్క ఫ్లాప్ సినిమా పడితే మాత్రం వచ్చినా అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా స్టోరీ అనేది హీరోని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి సినిమాల్లో హీరోలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక హీరోయిన్స్ ఉన్నప్పటికి హీరోలకు సపోర్ట్ చేసే క్యారెక్టర్ లో గాని లేదంటే పాటలకు మాత్రమే పరిమితమయ్యే పాత్రను గాని పోషిస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ కెరియర్ కి సినిమా హెల్ప్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక అల్టిమేట్ గా సినిమా సక్సెస్ అయితే అందులో నటించిన హీరో హీరోయిన్స్ కి కూడా చాలా మంచి గుర్తింపైతే వస్తుంది…కానీ రష్మిక మందాన (Rashmika Mandana) చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధిస్తూ ఉండడం విశేషం… ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత చేసిన సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటుంది.
ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘ఛావా’ (Chavaa) సినిమాతో రష్మిక మరోసారి తన సత్తా చాటుకుంది. నటనలోనూ రష్మిక అద్భుతమైన నటనను కనబరుస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆమెకు చాలా మంచి గుర్తింపైతే లభించింది. ఆమె తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తానని ఈ సందర్భాల్లో తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగాలనే ఉద్దేశ్యం తో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.
అందుకోసమే ఇప్పుడు ప్రతి హీరో సినిమాలో తనని హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమెకు భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ప్రతి భాషలోని స్టార్ హీరోలు సైతం ఆమెతో ఒక సినిమా అయిన చేయాలని కోరుకుంటున్నారు అంటే ఆమె ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు…