Rashmi Jabardasth Controversy: జబర్దస్త్(Jabardasth) షోలో పొట్టిబట్టలు ధరించి గ్లామర్ షోకి తెరలేపింది ఓ లేడీ కమెడియన్. యాంకర్ రష్మీ గౌతమ్(Anchor Rashmi Gautam) కి పోటీ ఇస్తున్న అమ్మడు, మొత్తం అటెన్షన్ కొట్టేస్తుంది. ఇంతకీ ఎవరా లేడీ కమెడియన్…
జబర్దస్త్ అనగానే రష్మీ గౌతమ్, అనసూయ గుర్తుకు వస్తారు. 2013లో మొదలైన ఈ షోకి అనసూయ యాంకర్ గా ఎంపికైంది. షో సక్సెస్ కావడంతో అనసూయకు తక్కువ సమయంలో ఫేమ్ దక్కింది. వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్ళు అనసూయ జబర్దస్త్ కి దూరమైంది. దాంతో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. అనసూయను మరిపించిన రష్మీ సైతం స్టార్ హోదా తెచ్చుకుంది. జబర్దస్త్ కి మరింత ఆదరణ దక్కడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరో షో తీసుకొచ్చారు. దాంతో అనసూయ రీ ఎంట్రీ కి మార్గం దొరికింది. ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ, జబర్దస్త్ కి అనసూయ యాంకర్స్ గా ఉండేవారు.
Also Read: అక్షరాలా 2,50,000 టికెట్స్..గ్రాస్ విషయంలో ‘హరి హర వీరమల్లు’ నయా రికార్డు!
గ్లామరస్ యాంకర్స్ గా బుల్లితెరను అనసూయ, రష్మీ అల్లాడించారు. వీరికి ముందు తరం యాంకర్స్ ఎవరూ స్కిన్ షో చేసింది లేదు. తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేశారు. అదే సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇంటిల్లిపాది కలిసి చూసే షోలలో పొట్టిబట్టలు ధరించడం వివాదాస్పదం అయ్యింది. ముఖ్యంగా అనసూయ ఎక్కువ నెగిటివిటీ చవిచూసింది. కానీ ఆమె తగ్గింది లేదు. పైగా తనను జడ్జి చేసే హక్కు ఎవరికీ లేదంటూ ఫైర్ అయ్యింది. నేను ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్ణయించడానికి మీరు ఎవరంటూ… అనసూయ కౌంటర్లు ఇచ్చింది.
ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ లో లేదు. రష్మీ గౌతమ్ మాత్రం కొనసాగుతోంది. రెండు ఎపిసోడ్స్ కి ఆమె యాంకర్ గా వ్యవహరిస్తోంది. గతంతో పోల్చితే గ్లామర్ షో తగ్గించింది రష్మీ. కాగా ఈమెకు ఓ లేడీ కమెడియన్ గ్లామర్ విషయంలో పోటీ ఇస్తుంది. ఆమె ఎవరో కాదు వర్ష. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆమె డ్రెస్ చూస్తే అవాక్కే . షార్ట్ ఫ్రాక్ లో సూపర్ గ్లామరస్ గా కనిపించింది. వర్ష(Varsha) అంతకంతకు గ్లామర్ షో పెంచేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: భర్త తో ఈ రేంజ్ రొమాన్స్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
దాంతో రష్మీకి దక్కాల్సిన అటెన్షన్ వర్ష లాగేస్తుంది. గతంలో వర్ష సీరియల్స్ చేసింది. జబర్దస్త్ షో ఆమె ఫేట్ మార్చేసింది. ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఆమెను ఫాలో అవుతున్నారు. జబర్దస్త్ కి వచ్చాక పాపులారిటీతో పాటు ఆర్థికంగా ఆమె బలపడింది. ఈ మధ్య జబర్దస్త్ కి ఆదరణ తగ్గిన నేపథ్యంలో వర్ష లాంటి లేడీ కమెడియన్స్ తో కూడా గ్లామర్ షో చేయిస్తున్నారేమో అనే సందేహం కలుగుతుంది. వర్ష తీరు గమనిస్తుంటే భవిష్యత్ లో రష్మీ పోస్ట్ కి ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
