Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi Emotional Visit:తల్లి సమాధి వద్ద మంచు లక్ష్మి, మరి మోహన్ బాబు భార్య...

Manchu Lakshmi Emotional Visit:తల్లి సమాధి వద్ద మంచు లక్ష్మి, మరి మోహన్ బాబు భార్య ఎవరు?

Manchu Lakshmi Emotional Visit:మంచు లక్ష్మి తన తల్లి సమాధిని సందర్శించారు. సమాధి వద్ద ఆమె భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి తల్లి ఎవరు? మోహన్ బాబు ప్రస్తుత భార్య ఎవరు? అనే సందేహాలు మొదలయ్యాయి..

మోహన్ బాబు(MOHAN BABU) కుమార్తె మంచు లక్ష్మి(MANCHU LAKSHMI) మల్టీ టాలెంటెడ్. ఆమె టెలివిజన్ హోస్ట్, యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ కూడాను. మంచు లక్ష్మి హీరోయిన్ గా కూడా చిత్రాలు చేసింది. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు. నటిగా ప్రేక్షకుల మదిలో ఆమె ముద్ర వేయలేకపోయింది. ట్రోలర్స్ కి మంచు లక్ష్మి మాటలు ఎవర్ గ్రీన్ మెటీరియల్. ఆమె సినిమాల కంటే యూట్యూబ్ లో మీమ్స్, ట్రోల్స్ బాగా ఫేమస్. తనను ట్రోల్ చేసేవారిని లైట్ తీసుకుంటుంది మంచు లక్ష్మి. పనిలేని వారు ఏదో అన్నారని మనం ఆగిపోకూడదు. విమర్శలు చేసే వారు చేస్తూనే ఉంటారు. మనం మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలి అంటుంది.

Also Read:  భర్త తో ఈ రేంజ్ రొమాన్స్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

కొద్ది రోజుల క్రితం ముంబై కి షిఫ్ట్ అయ్యింది మంచు లక్ష్మి. అక్కడ ఖరీదైన అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంది. మెరుగైన కెరీర్ కోసమే ముంబై వెళ్లినట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. ఇటీవల ఆమె టైటర్స్ పేరుతో ఓ ఓటీటీ షో చేయడం విశేషం. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇదిలా ఉండగా మంచు లక్ష్మి ఏపీలోని నెల్లూరుకు వచ్చారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిశాక ఆమె నాయుడు పేటలోని తల్లి సమాధిని సందర్శించారు. తల్లిని తలచుని సమాధి వద్ద భావోద్వేగానికి గురయ్యారు.

ఏంటి మంచు లక్ష్మి తల్లి మరణించారా? ప్రస్తుతం ఉన్న మోహన్ బాబు భార్య నిర్మలా దేవి ఎవరు? అనే సందేహం రావొచ్చు. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి. ఆమె చాలా కాలం క్రితమే కన్నుమూశారు. విద్యాదేవి మరణించాక నిర్మలాదేవిని మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నాడు. నిర్మలాదేవి ఎవరో కాదు విద్యాదేవి సొంత చెల్లెలు. విద్యాదేవికి మంచు లక్ష్మి, విష్ణు సంతానం కాగా… మనోజ్ నిర్మలాదేవి కుమారుడు. అదన్నమాట మేటర్. విద్యాదేవి గురించి సాధారణ జనాలకు తెలిసింది తక్కువే.

ఇక మోహన్ బాబు కుటుంబంలో విబేధాలు కొనసాగుతున్నాయి. మంచు విష్ణు, మోహన్ బాబు ఒక వర్గంగా మనోజ్ మరొక వర్గంగా ఏర్పడి గొడవలకు దిగారు. కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. పరస్పర దాడులు చేసుకోవడంతో పాటు కేసులు పెట్టుకున్నారు. ఇరు వర్గాలకు పోలీస్ అధికారులు వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. మనోజ్ కి అండగా మంచు లక్ష్మి నిలబడటం విశేషం.

Exit mobile version