https://oktelugu.com/

Rashmi Sudigali Sudheer: తగ్గేదేలే అంటూ రెచ్చిపోయిన ‘రష్మీ- సుడిగాలి సుధీర్’ !

Rashmi Sudigali Sudheer: బుల్లితెరలో మోస్ట్ క్రేజీ జోడీ అంటే. ‘రష్మీ- సుడిగాలి సుధీర్’ జంటే. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి టీఆర్పీ రేటింగ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ఈ ఇద్దరి క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి టీవీ ఛానెల్స్.. నిర్మాణ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. నిజానికి గత తొమ్మిదేళ్లుగా ఈ జంట ప్రేక్షకులకు ఫేవరేట్ జంటగానే నిలవడం నిజంగా విశేషమే. అయితే, గత కొంత కాలంగా స్పెషల్ ఈవెంట్లలో ఈ జంట కనిపించడం లేదు. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 12, 2022 / 10:56 AM IST
    Follow us on

    Rashmi Sudigali Sudheer: బుల్లితెరలో మోస్ట్ క్రేజీ జోడీ అంటే. ‘రష్మీ- సుడిగాలి సుధీర్’ జంటే. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి టీఆర్పీ రేటింగ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ఈ ఇద్దరి క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి టీవీ ఛానెల్స్.. నిర్మాణ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. నిజానికి గత తొమ్మిదేళ్లుగా ఈ జంట ప్రేక్షకులకు ఫేవరేట్ జంటగానే నిలవడం నిజంగా విశేషమే. అయితే, గత కొంత కాలంగా స్పెషల్ ఈవెంట్లలో ఈ జంట కనిపించడం లేదు. ఢీ షోలో ఈ ఇద్దరూ జంటగా కనిపించేవారు. కానీ, ఢీ షో నుంచి సుధీర్ బయటకు వచ్చాడు.

    అప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి పండుగ స్పెషల్ ఈవెంట్లు చేయడం లేదు. దీనికి తోడు సుధీర్ సినిమాలు చేస్తున్నాడు. రష్మీ మాత్రం జీ తెలుగు, స్టార్ మా అంటూ చక్కర్లు కొడుతోంది. మల్లెమాల సైతం ఈ మధ్య స్పెషల్ ఈవెంట్లకు సుధీర్‌ ను దూరం పెడుతుంది. అయితే, తాజాగా ఈటీవీలో మల్లెమాల చేస్తోన్న హోళీ ఈవెంట్ ‘రంగ్ దే’ అంటూ వచ్చిన ఈ ప్రోమోలో సుధీర్ కనిపించలేదు.

    దాంతో సుధీర్ ఎక్కడా ? అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్లతో మల్లెమాల మీద తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు ‘స్టార్ మా చానెల్‌’ కూడా ఓ హోళీ ఈవెంట్‌ ను చేసింది. ఆ ఈవెంట్ లో సుధీర్ కనిపించాడు. తగ్గేదేలే అంటూ యాంకర్ రవి, రష్మీ హోస్ట్ చేస్తోన్న ఈ షోలో సుధీర్ కనిపించి ఆమెతో తన ప్రేమ హావభావాలను ప్రదర్శించాడు. ముఖ్యంగా సుధీర్, రష్మీ మధ్య ఎమోషనల్ బాండింగ్‌ చాలా బాగా హైలైట్ అయ్యింది.
    Also Read: China Imposes lockdown: ప్రపంచం అంతా తెరుచుకుంటుంటే చైనా మూసేస్తుంది!
    పైగా రష్మీ కోసం సుధీర్ పాట పాడటం, రష్మీ దిష్టి చుక్క పెట్టేయడం అన్నీ చాలా చక్కగా కుదిరాయి. దాంతో స్టార్ మా హోళీ పండుగ ఈవెంట్‌ పై ప్రేక్షకులు రెట్టింపు ఆసక్తి చూపిస్తున్నారు. మొదటి సారిగా ‘స్టార్ మా’ ఈవెంట్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఈవెంట్ టీఆర్పీ రేటింగ్ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.

    సుధీర్ రష్మీల మీద గతంలో చేసిన ఎన్నో ఈవెంట్లు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. మెయిన్ గా ఈ ఇద్దరి పెళ్లి మీద చేసిన ఈవెంట్లు అప్పట్లో ఒక సంచలనం. మళ్ళీ ఇన్నాళ్ళకి సుధీర్ రష్మీ జోడి మరో సంచలనానికి తెర తీసింది.
    Also Read: Akhil Agent Release Date: ఆగస్టు 12న రానున్న ఏజెంట్.. అఖిల్ కోరిక తీరుస్తాడా ?

    Tags