https://oktelugu.com/

ఎవరూ లేని వేళ సుధీర్ ను ఇంటికి రమ్మన్న రష్మీ

కొన్ని జంటలు కలల పంటలుగా నిలుస్తాయి. చూడచక్కనైన అందంతో ఆకట్టుకుంటారు. అదే కోవలో టీవీ వ్యాఖ్యాతలు రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ నిలుస్తున్నారు. ఏడేళ్లుగా ఈ జంట టీవీ షోల్లో సందడి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాల్లో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. చూడముచ్చటైన జంటగా పేరుపొంది తెలుగు ప్రాంతాల్లో తమ అందంతో మెప్పిస్తున్నారు. దీంతో ఇటీవల యాంకర్ రష్మీ సుడిగాలి సుధీర్ కు ఫోన్ చేయడంతో కలకలం రేగింది. దీంతో వీరిద్దరి తీరుపై అనుమానాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 16, 2021 / 10:45 AM IST
    Follow us on

    కొన్ని జంటలు కలల పంటలుగా నిలుస్తాయి. చూడచక్కనైన అందంతో ఆకట్టుకుంటారు. అదే కోవలో టీవీ వ్యాఖ్యాతలు రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ నిలుస్తున్నారు. ఏడేళ్లుగా ఈ జంట టీవీ షోల్లో సందడి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాల్లో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. చూడముచ్చటైన జంటగా పేరుపొంది తెలుగు ప్రాంతాల్లో తమ అందంతో మెప్పిస్తున్నారు. దీంతో ఇటీవల యాంకర్ రష్మీ సుడిగాలి సుధీర్ కు ఫోన్ చేయడంతో కలకలం రేగింది. దీంతో వీరిద్దరి తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి.

    జబర్దస్త్ షో ద్వారా ఫేం అయిన రష్మీ పలు చిత్రాల్లో మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తన ప్రతిభను చూపిస్తున్నాడు సుడిగాలి సుధీర్. వీరిద్దరి కలయికలో పలు షోలు విజయవంతం అవుతున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకుని ఢీ షో లో కూడా తమ ఫర్ఫామెన్స్ ప్రదర్శిస్తున్నారు. దీంతో రెండు ప్రాంతాల్లో వారికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి కాంబినేషన్ లో వస్తున్న షోలను క్రమం తప్పకుండా చూస్తున్నారు.

    మొదట్లో మామూలుగా ఉన్న రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జంట రానురాను ప్రేమజంటగా గుర్తింపు పొందింది. దీనికి తోడు వారి సంభాషణలు కూడా అదే కోవలో ఉండడంతో యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ జంట రొమాన్స్ చేసేలా ఉందని ప్రశంసలు వచ్చాయి. ఎప్పటికప్పుడు అలాంటిదేమీ లేదని రష్మీచెబుతున్నా పట్టించుకోవడం లేదు. వీరిద్దరి క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి టీవీ షోల నిర్వాహకులు పాటల్లో రొమాంటిక్ స్కిట్ లు చేయిస్తున్నారు. దీంతో వీరి జంట ప్రేమకు మార్కుగా నిలిచింది.

    రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జంట తరచూ ప్రేమజంటగానే కనిపిస్తున్నారు. ఇప్పటికే వీరి మధ్య ఉన్నది ప్రేమ అని వ్యక్తపరుస్తున్న జంటనిత్యం వార్తల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా రష్మీ గౌతమ్ ఓ షోలో భాగంగా కమెడియన్ సుధీర్ కు ఫోన్ చేయడం కలకలం రేపింది. వచ్చే వారం ప్రసారమయ్యే ఢీ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రష్మీ, సుధీర్ ఉత్తుత్తి ఫోన్ కాల్ చేసింది. అప్పుడామె ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. దేనికి నాకు ఫోన్ చేశావ్ ఏం అర్థం కావట్లేదు అని అంటాడు. దీంతో వెదవ సోది ఆపి ఇంటికి రా అంటుంది రష్మీ. అప్పుడు సుధీర్ ఎందుకు నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తావ్ అని షాకింగ్ కామెంట్ చేశాడు.