Rashmi Gautam- Soumya Rao: తెలుగు పాప్యులర్ షో జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చిన విషయం తెలిసిందే. కన్నడ బుల్లితెర పరిశ్రమకు చెందిన సౌమ్య రావుని తీసుకొచ్చారు. నవంబర్ 10 నుండి జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య రావు వ్యవహరించనున్నారు. ఆల్రెడీ సౌమ్య రావు ఎంట్రీకి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఇక వస్తూ వస్తూనే సౌమ్య రావు తన మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కమెడియన్స్ కి ధీటుగా ఆమె పంచెస్ కురిపించారు. ఏంటి నువ్వు యాంకరా? అన్న హైపర్ ఆదిని… నువ్వు కమెడియన్ అయినప్పుడు నేను యాంకర్ ని కానా..? అంటూ రివర్స్ పంచ్ వేసింది.

రష్మీ స్థానంలో యాంకర్ గా సౌమ్య రావుని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనసూయ మానేయడంతో జబర్దస్త్ యాంకర్ పోస్ట్ ఖాళీ అయ్యింది. కొత్త యాంకర్ ని తేకుండా ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న రష్మీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆమె స్థానంలోకి సౌమ్య రావు వచ్చారు. ఈ క్రమంలో రష్మీ ఫీలింగ్ ఏమిటో తెలుసుకోవాలని మీడియా ఆసక్తి చూపించింది. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మీని ఈ ప్రశ్న అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పారు.
సౌమ్య రావుపై నాకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదు. నా స్థానంలోకి కొత్త యాంకర్ వస్తుందని ముందే చెప్పారు. అనసూయ మానేయడంతో కొత్త యాంకర్ ని తీసుకునే వరకు నన్ను యాంకర్ గా ఉండమన్నారు. సౌమ్య రావు గ్యాప్ తీసుకున్నా, పూర్తిగా షో మానేసినా నేను మళ్ళీ రంగంలోకి దిగుతాను. జబర్దస్త్ యాంకర్ గా నేను వ్యవహరించేది కొద్దికాలమే అని నాకు తెలుసు, కాబట్టి ఈ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదన్నారు.

సౌమ్య రావు రాకతో రష్మీ ఎక్స్ట్రా ఇన్కమ్ కోల్పోయారు. రష్మీ ఎపిసోడ్ కి రెండు లక్షల పైనే తీసుకుంటున్నారు. ఆ విధంగా రష్మీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ తో వారానికి నాలుగు లక్షల పైన సంపాదిస్తున్నారు. మరోవైపు కొత్త యాంకర్ సౌమ్య రావు ఎంత మేరకు సక్సెస్ అవుతారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. జబర్దస్త్ యాంకర్స్ గా రష్మీ గౌతమ్, అనసూయ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. సౌమ్య రావుకి వాళ్ళను బీట్ చేయడం, తన మార్క్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ సక్సెస్ అయితే సౌమ్య రావు రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.