spot_img
Homeఎంటర్టైన్మెంట్Rashmi Gautam: గుంటూరు కారంలో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న రష్మీ!

Rashmi Gautam: గుంటూరు కారంలో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న రష్మీ!

Rashmi Gautam: రష్మీ.. తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అక్కరలేని పేరు. జమర్దస్త్‌. శ్రీదేవి డ్రామా కంపెనీలతోపాటు, అనేక షోలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అనసూయ తర్వాత అంతటి క్రేజీ తెచ్చుకున్న యాంకర్‌ రష్మీ. అడపా దడపా సినిమాల్లో కూడా మెరుస్తుంది. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది. గుంటూరు టాకీస్‌ ద్వారా హీరోయిన్‌గా వెండితెరపై వెలిగిన రష్మీ.. మహేశ్‌బాబు గుంటూరు కారంలో ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది.

ఏం జరిగిందంటే..
ప్రిన్స్‌ మహేశ్‌బాబు, శ్రీలీల జంటగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గుంటూరు కారం తెరకెక్కించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చినా.. గుంటూరు కారం, హనుమాన్‌ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక గుంటూరు కారంలో కుర్చిని మడతపెట్టి సాంగ్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. సోషల్‌ మీడియాలో రీల్స్‌ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. సినిమా అంతా ఒక ఎత్తు అయితే కుర్చిని మడతపెట్టి సాంగ్‌ ఒక ఎత్తు అన్నట్లుగా చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ పాటకు రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతటి క్రేజ్‌ ఉన్న ఈ పాటలో నటించే అవకాశాన్ని రష్మీ మిస్‌ చేసుకుంది.

పూర్ణ స్థానంలో అవకాశం..
కుర్చీని మడతపెట్టి పాటలో నటి పూర్ణ ఆకట్టుకుంది. పాట ప్రారంభం నుంచి మధ్యలో కొన్ని స్టెప్పులతో మెరిసింది. బొద్దుగా ఉన్నప్పటికీ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. పూర్ణ స్టెప్స్‌కు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి క్లాప్స్, విజిల్స్‌ వస్తున్నాయి. అయితే దర్శకుడు త్రివిక్రమ్‌.. ఈ క్యారెక్టర్‌ను పూర్ణకు ముందు రష్మీనే అడిగారట. కానీ, రష్మీ దీనికి యాక్సెప్ట్‌ చేయలేదట. కేవలం ఒక్క పాటలో, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించే పాత్రలో చేయనని చెప్పారట. దీంతో త్రివిక్రమ్‌ తర్వాత పూర్ణను సంప్రదించారట. ఆమె ఒప్పుకోవడంతో ఈ పాట తెరకెక్కించారు.

సోషల్‌ మీడియలో వైరల్‌..
త్రివిక్రమ్‌ తీసిన గుంటూరు కారం సినిమాలో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న రష్మీ అంటూ.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మంచి ఛాన్స్‌ మిస్‌ చేసుకుందని చాలా మంది కామెంట్లు పెడతున్నారు. కొందరు మాత్రం మంచిపనైంది. ఆమె చేసి ఉంటే ఈ పాట కూడా ప్లాప్‌ అయ్యేదని కామెంట్‌ చేస్తున్నారు.

మొత్తానికి గుంటూరు టాకీస్‌ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రష్మీ.. గుంటూరు కారం మిస్‌ చేసుకోవడం గమనార్హం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version