Rashmi Gautam- Sudigali Sudheer Marriage: బుల్లితెరపై చెరగని ముద్ర వేశారు సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్. ఆడియన్స్ లో వీరికి యమ క్రేజ్ ఉంది. దశాబ్దకాలంగా చూస్తున్నా జనాలకు బోర్ కొట్టలేదు. షోస్ లో రష్మీ-సుధీర్ నాన్ స్టాప్ రొమాన్స్ పంచారు. తిరుగులేని జంటగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి చేసిన ప్రతి షో సూపర్ సక్సెస్ అయ్యాయి. జబర్దస్త్ వేదికగా మొదలైన వీరి లవ్ స్టోరీ పలు ఈవెంట్స్ కి పాకింది. ఇక ఢీ షోలో రష్మీతో సుధీర్ చేసిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

మరి పాలు నీళ్లలా కలిసి పోయిన ఈ జంట మధ్య ఉన్న బంధం ఏమిటీ? వారు ప్రేమికులా? స్నేహితులా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. అయితే పలుమార్లు తాము కేవలం మిత్రులమని చెప్పారు. అయితే వారి చేతలు మాత్రం ప్రేమికులను తలపిస్తున్నాయి. కేవలం షోలో మాత్రం మేము ప్రేమికులమని, బయట స్నేహితులమని అంటారు. షో ముగిశాక మా మధ్య పెద్దగా మాటలు ఉండవు. కలుసుకోవడం కూడా జరగదని కొన్ని సందర్భాల్లో చెప్పారు.
టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు ఇది నమ్మడం లేదు. ఇలానే చెబుతూ ఏదో రోజు పెళ్లి ప్రకటన చేస్తారన్న అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. దానికి తోడు ఇటీవల రష్మీ చేసిన కామెంట్స్ ఈ అనుమానాలకు ఆజ్యం పోశాయి. రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మీని సుధీర్ తో రిలేషన్ పై పెదవి విప్పారు. సుధీర్ తో నాకు ఉన్న రిలేషన్ ఏమిటో బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్ లో అదే తెలుస్తుంది. ప్రతి విషయాన్ని బహిర్గతం చేస్తే జీవితంలో ఇంకా ఏమీ మిగలదు, అని రష్మీ చెప్పుకొచ్చారు.

రష్మీ వ్యాఖ్యలు విన్న జనాలు మాత్రం రష్మీ చెప్పకనే చెప్పింది. ఆమె సుధీర్ తో తన ప్రేమను పరోక్షంగా తెలియజేసింది అంటున్నారు. మరి ఈ చిక్కుముడి వీడాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి. సుధీర్-రష్మీల ప్రస్తుత వయసు 35 ఏళ్ళు . ఇద్దరూ పెళ్లి మాట ఎత్తడం లేదు. గట్టిగా అడిగితే దానికి ఇంకా సమయం ఉందంటున్నారు. వారు పెళ్లి చేసుకోకుండా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేయడం కూడా వారి ప్రేమికులు అనే పుకార్లకు కారణం అవుతుంది. మరోవైపు గాలోడు మూవీతో సుధీర్ హిట్ కొట్టాడు.