Rashmi Gautam- Sudigali Sudheer: సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ మేము స్నేహితులం అంటారు మళ్ళీ కాదంటారు. మా బంధం ఏమిటో బయటకు చెప్పాల్సిన అవసరం లేదంటారు. ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా జనాల మెదళ్ళు తొలి చేస్తూ ఉంటారు. మల్లెమాల షోస్ కి కొన్ని నెలలు దూరమైన సుధీర్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. తన లేటెస్ట్ మూవీ గాలోడు ప్రమోషన్స్ లో సుధీర్ తిరిగి జబర్దస్త్ కి వస్తానని చెప్పాడు. మల్లెమాల సంస్థతో ఎలాంటి విబేధాలు లేవు. కొన్ని ఇబ్బందుల రీత్యా ఆరు నెలలు విరామం అడిగి బయటకు వచ్చాను, త్వరలో జబర్దస్త్ కి వస్తాను అన్నారు. చెప్పినట్లే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలో సుధీర్ రీఎంట్రీ ఇచ్చాడు.

సుధీర్ రాకతో రష్మీ గౌతమ్ లో ఆనందం వెల్లివిరుస్తుంది. మళ్ళీ రొమాన్స్ మొదలుపెట్టారు. బుల్లితెరపై డ్యూయెట్స్ పాడుకుంటున్నారు. కాగా ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ ఎపిసోడ్ కి గాలోడు టీమ్ తో సుధీర్ రావడం జరిగింది. గాలోడు మూవీ నవంబర్ 18న విడుదల కానుంది. ఈ క్రమంలో జబర్దస్త్ వేదికగా ప్రమోట్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా సుధీర్ స్కిట్ చేశాడు. సదరు స్కిట్ లో డైరెక్టర్ రామ్ ప్రసాద్… హీరో సుధీర్ ని హీరోయిన్ రష్మీకి ప్రపోజ్ చేయమంటారు.
గులాబీ పువ్వు రష్మీకి ఇస్తూ సుధీర్… ‘నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా’ అని డైలాగ్ చెప్పాడు. సుధీర్ డైలాగ్ కి రష్మీ ‘సరే చచ్చిపోరా’ అని టైమింగ్ పంచ్ వేసింది. దాంతో జడ్జెస్ కృష్ణ భగవాన్, ఇంద్రజ గట్టిగా నవ్వేశారు. అదే సమయంలో ఎంత స్కిట్ అయితే మాత్రం అంత మాట అనేసిందేంటని వాపోతున్నారు. రష్మీ లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో గాలోడు మూవీతో సుధీర్ కూడా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కాగా ఇటీవల సుధీర్ తో ఎఫైర్ పై రష్మీ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా… జీవితంలో ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ పోతే ఏమీ మిగలదు. సుధీర్ తో నా బంధం ఏమిటనేది నాకు తెలుసు. అది బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో అది ఏమిటో తెలుస్తుంది అన్నారు. రష్మీ మాటలు మరోసారి సుధీర్ ని ఆమె ప్రేమిస్తుందన్న పుకార్లను బలపరిచేదిగా ఉంది. ఇద్దరూ హీరో హీరోయిన్స్ గా రాణిస్తున్న నేపథ్యంలో కలిసి ఒక సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.