https://oktelugu.com/

Raashi Khanna : మేకప్ లేకుండా రాశిఖన్నా ఎంత అందంగా ఉందో చూడండి.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

అందుకే ఎంతో ఎంతంగా కనిపిస్తున్నానని చెబుతోంది. రాశిఖన్నా చెప్పిన ఈ టిప్స్ పై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2023 10:52 am
    Follow us on

    Raashi Khanna : ముద్దు ముద్దుగా.. ముసి ముసి నవ్వులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా విశేష గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ రాశి ఖన్నాకు స్పెషల్ ఇమేజ్ ఉంది. స్టార్ హీరోల పక్కన నటించిన ఈ భామ ఇటీవల తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆ సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అందంగా ఉండడానికి కేవలం క్రిములు మాత్రమే కాకుండా కొన్ని ఇంట్లో టిప్స్ వాడడం వల్ల ఫేసులో గ్లో అవుతోందని చెప్పింది. అంతేకాకుండా ఆమె చేస్తూ చూపించింది.

    తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా. ఈ మూవీ యావరేజ్ హిట్టయినా రాశిఖన్నా నటనకు మాత్రం గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో నటించి మెప్పించింది. అయితే తెలుగులో సరైన గుర్తింపు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

    రీసెంట్ గా రాశిఖన్నా తమిళంలో ‘అరణ్మనై 4’, ‘మేథావి, హిందీలో యోదా సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ తరుణంలో రాశి ఖన్నా గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. అయితే అలా అందంగా ఉండడానికి ప్రత్యేకంగా క్రిములు వాడకుండా ఇంట్లో కొన్ని టిప్స్ పాటిస్తుందట. ముఖ్యంగా ఫొటో షూట్ కు ముందు ఇలా చేసిన ఆ తరువాత కెమెరా ముందుకు వస్తుందట. దీంతో ఫేసులో గ్లో కనిపిస్తుందని చెబుతుంది.

    అందుకోసం ఏం చేయాలో రాశిఖన్నా చెప్పింది. ముందుగా ఒక గిన్నెలో ఐస్ వాటరు తీసుకోవాలి. ఈ నీళ్లలో మోహం కాసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత మెత్తటి గుడ్డతో క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత ఫేసుపై ఎలాంటి క్రిములు ఉన్నా తొలిగిపోతాయి. దీంతో ఫేస్ క్లీన్ గా ఉండడంతో పాటు గ్లో వస్తుందని రాశిఖన్నా చెబుతుంది. తాను ఫొటో షూట్ కు వెళ్లే ముందు అలాగే చేస్తుందట. అందుకే ఎంతో ఎంతంగా కనిపిస్తున్నానని చెబుతోంది. రాశిఖన్నా చెప్పిన ఈ టిప్స్ పై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.