Homeఎంటర్టైన్మెంట్Rashi Khanna: 'వేణు ఉడుగుల' వ్యభిచార కూపంలో 'రాశి ఖన్నా'

Rashi Khanna: ‘వేణు ఉడుగుల’ వ్యభిచార కూపంలో ‘రాశి ఖన్నా’

Rashi Khanna: హీరోయిన్ రాశి ఖన్నా చిన్న సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. గుర్తింపు అయితే వచ్చింది గాని, పెద్ద హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. స్టార్ డమ్ ని తెచ్చుకోవాలని మధ్యలో ఎక్స్ పోజింగ్ కూడా మొదలు పెట్టింది. అయినా రాశి ఖన్నాకి ఏ స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వలేదు. ఒక్క మారుతి మాత్రం హీరోయిన్ గా ఆఫర్లు ఇచ్చాడు. అది కూడా ఆమె కెరీర్ కి ప్లస్ కంటే… ఎక్కువ మైనసే అయింది.

Rashi Khanna
Rashi Khanna

పాపం ఎంతో కాలంగా స్టార్ డమ్ కోసం యుద్ధం చేస్తోన్నా రాశి ఖన్నాకి ఎన్నడూ కాలం కలిసిరాలేదు. అదృష్టం కలిసి వచ్చి తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసినా, వాటిల్లో ఏ సినిమా పెద్దగా కెరీర్ కి ఉపయోగపడలేదు. మొత్తానికి నటిగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి అవుతున్నా.. ఇంతవరకు కెరీర్ ను సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోయింది. కారణం తానూ చిన్న సినిమాలతో ఎంట్రీ ఇవ్వడమే అని అమ్మడు తెగ ఫీల్ అవుతుంది.

Also Read: ఐశ్వర్య రాయ్, త్రిష’ లుక్స్ తో అదరగొట్టిన లెజెండరీ డైరెక్టర్

నిజానికి ఇది కారణం అని అనుకోలేం. ఒకవేళ అదే నిజమైతే.. అమ్మడికి తమిళంలో అవకాశాలు రావాలిగా ? అక్కడ కూడా ఎప్పటి నుండో ఛాన్స్ లు కోసం ఆడిషన్స్ కూడా ఇస్తోందిగా.. ఏ అక్కడెందుకు ఇంతవరకు చెప్పుకోతగ్గ ఒక్క అవకాశం కూడా తెచ్చుకోలేక పోయింది.. ? కారణం ఏదైనా కావొచ్చు.. రాశి ఖన్నాలో మ్యాటర్ ఉంటే ఏ భాషలోనైనా ఛాన్స్ లు వస్తాయి.

Rashi Khanna
Rashi Khanna

అలా అని రాశి ఖన్నాని మంచి నటి కాదు అని చెప్పలేం. కచ్చితంగా ఆమె నేటి జనరేషన్ లో మంచి నటినే. కానీ సినిమాల్లో టాలెంట్ ఒక్కటే సరిపోదు కదా. ఇక ప్రస్తుతం రాశి ఖన్నా ఏ క్యారెక్టర్ దొరికితే అది చేయడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో కూడా రాశి ఖన్నా నటించబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ ఫామ్‌ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.

విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాణంలో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. అన్నట్టు ఈ సిరీస్ కి మారుతి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న విక్రమ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంతకీ కాన్సెప్ట్ ఏమిటంటే.. హై లెవల్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి తన ఆర్థిక అవసరాల కోసం వ్యభిచార కూపంలో ఎలా ఇరుక్కుంది. ఆ తర్వాత వేశ్యగా చెప్పుకోలేని ఇబ్బందులు పడి తిరిగి ఆ వ్యభిచార ఉచ్చులో నుండి ఎలా బయట పడింది అనే కోణంలో ఈ సిరీస్ సాగనుంది.

Also Read: త్రివిక్రమ్ కి యాక్షన్ సెట్ కాదు అంటున్న మహేష్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

  1. […] Singer Sai Sanvid:  ఆయనది ఆడగొంతు అని అవమానించారు.. ఆ గొంతు పుట్టుకతో వచ్చినందువల్ల తానేమీ చేయలేకపోయాడు.. ఎన్నో అవమానాలు భరించారు..ఒక దశలో అతనిని ‘గే’.. అన్న వారున్నారు. అయినా ఆ మాటలకు కుంగిపోకుండా తన జీవిత గమ్యాన్ని చేరాలనుకున్నాడు. అయితే ఆడ గొంతే అతనికి వరం అయ్యింది.. ఆ గొంతుతో పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.. ఈ గొంతు విన్న వాళ్లు ప్రముఖ సింగర్ చిత్ర పాడుతుందని అనుకున్నారు. కానీ ఆ తరువాత తెలుసుకున్నారు.. ఈ గొంతు సాయి సాన్విద్ అని. సాయిసాన్విద్ ను ఒకప్పుడు అవమానించిన వాళ్లు ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడు హేళన చేసిన వాళ్లు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన తన గొంతును ఇప్పుడు ‘సరిగమప’ కార్యక్రమంలో వినిపించబోతున్నాడు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular