
Rashi Khanna Marriage: రాశి ఖన్నా చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. చెప్పాలంటే ఆమె ఒక హిందీ చిత్రం మాత్రమే చేస్తున్నారు. రాశి నటించిన వెబ్ సిరీస్ పార్జీ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో రాశి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెళ్లి టాపిక్ చర్చకు వచ్చింది. గతంతో పోల్చితే మీరు సినిమాలు చేయడం తగ్గించినట్లు అనిపిస్తుంది. పెళ్లి చేసుకోవడం కోసమే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదనే చర్చ నడుస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏమిటనగా… రాశి ఆసక్తికర సమాధానం చెప్పారు.
నేను సినిమాలు తగ్గించలేదు. తెలుగులో మూడు, తమిళంలో మూడు కథలు విన్నాను. అవి చర్చల దశలో ఉన్నాయి. ఫార్జీ సిరీస్ విడుదల తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆగాను. అంతే కానీ పెళ్లి ఆలోచనలతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టలేదని వెల్లడించారు. దీంతో రాశి ఖన్నా పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. రాశి నటించిన రెండో వెబ్ సిరీస్ ఫార్జీ. గతంలో ఆమె రుద్ర టైటిల్ తో ఒక సిరీస్ చేశారు. అది హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్ర చేశారు.
అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా రూపొందిన ఫార్జీ భారీ బడ్జెట్ తో రూపొందించారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మీనన్ వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఫార్జీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రంలో రాశి ఖన్నా నటిస్తున్నారు. యోధ జులై 7న విడుదల కానుంది. దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతో సక్సెస్ కొట్టి బాలీవుడ్ లో సెటిల్ కావాలనేది రాశి ఆలోచన.

గత ఏడాది రాశి రెండు తెలుగు చిత్రాల్లో నటించారు. థాంక్యూ, పక్కా కమర్షియల్ దారుణ ఫలితాలు అందుకున్నాయి. రాశి ఖన్నాకు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ పడ్డాయి. కార్తీకి జంటగా నటించిన తమిళ చిత్రం సర్దార్ మాత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన సర్దార్ బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది. రాశి మాటల ప్రకారం త్వరలో కొన్ని తెలుగు చిత్రాలు ప్రకటించనున్నారు. ఆమె అభిమానులు అదే కోరుకుంటున్నారు.