
Nayanthara Vs Malavika: మాళవిక మోహనన్.. ఇదీ తన సినిమా అని చెప్పుకునేంత హిస్టరీ ఏమీ లేదు. జస్ట్ 9 సినిమాల వయస్సు ఆమెది. ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం పది సంవత్సరాల నుంచి నానా తిప్పలు పడుతోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా డీలక్స్ సినిమా లో నటిస్తోంది.. దీనికోసం మారుతిని కాళ్ళ వేళ్ళా పడ్డట్టు సమాచారం. ఆమె సొంత సినీ పరిశ్రమ మలయాళం లో మూడుకు మించి సినిమాల్లో నటించలేదు.. పొరుగున ఉన్న తమిళనాడులోనూ అదే పరిస్థితి. అంటే ఎలకను చూసినా ఆమె సెకండ్, థర్డ్ లేయర్ నటి.. అనగా పెద్ద పేరున్న హీరోయిన్ కాదని అర్థం. కానీ అలాంటి మాళవిక ఇప్పుడు రెచ్చిపోతోంది. నటనలో కాకుండా నోటికి పని చెబుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.
సినీ పరిశ్రమలో వర్తమాన నటలు సీనియర్లకు గౌరవం ఇవ్వాలి.. కానీ ఇప్పుడు అలా లేదు కదా… అసలే సోషల్ మీడియా రోజులాయే! ప్రచారం కోసం పాకులాడుతున్న రోజులాయే. ఏదోలాగా వార్తల్లో ఉండాలి. ఎప్పుడూ జనం నోళ్ళల్లో నాన్నతో ఉండాలి.. ఇవన్నీ దక్కాలంటే సీనియర్లను గెలుకుతూ ఉండాలి.. దీనివల్ల ఫాయిదా ఏమిటి అని అడగకండి. పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి. ఒక్కొక్కరి తత్వం ఒక్కో తీరు.

మాళవిక మోహనన్ ఒకసారి నయనతారను ఉద్దేశించి పనికిమాలిన వ్యాఖ్యలు చేసింది. రాజా రాణి అనే సినిమాలో ఆమె మేకప్ వేసుకొని ఆస్పత్రి పడక మీద కనిపిస్తుంది. దానిని ప్రస్తావిస్తూ నయనతార పేరు ఎత్తకుండానే.. మేకప్ వేసుకొని రోగిగా కనిపించడం ఏమిటి అసలు? ఎంత కమర్షియల్ సినిమా అయితే మాత్రం ఇలా నటిస్తారా? అంటూ తిక్క తిక్కగా మాట్లాడింది. నిజానికి నయనతార ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది.. 40 కి దగ్గర్లో ఉన్నా ఆమెకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు.. ఇప్పటికిప్పుడు ఆమె నటించేందుకు ఒప్పుకుంటే బ్లాక్ చెక్కులు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు నిర్మాతలు.. ఈ విషయం మాళవికకు తెలియనట్టుంది.. ఒక నటి ఒక సీన్ లో ఎలా కనిపించాలి అనేది దర్శకుడు ఇష్టం. అదే సీరియల్స్ లో అయితే ఈ పైత్యం మరింత ఎక్కువగా ఉంటుంది. రాజా రాణి సినిమా తీసింది అట్లీ.. గతంలో సీరియల్స్ బాగా చూసి ఉంటాడు. అందుకే అలాంటి సన్నివేశం పెట్టినట్టు ఉన్నాడు.
ఇక ఈ ఎపిసోడ్ లో నయనతార మాళవిక వ్యాఖ్యకు సమాధానం ఇస్తూ కమర్షియల్ సినిమాలో ఇవన్నీ పట్టించుకుంటే కుదరదు. అయినా దర్శకుడు ఇష్టం, మన చిత్తానుసారం నటించలేం కదా అని వివరించింది.. దీనిని మాళవిక అడ్వాంటేజ్ గా తీసుకుంది. మళ్లీ ఓ ఇంటర్వ్యూలో అసలు నయనతార సూపర్ స్టార్ కావచ్చు కాక.. కానీ లేడీ సూపర్ స్టార్ అనడం దేనికి? జస్ట్ సూపర్ స్టార్ అంటే చాలు కదా అని కూసింది. నిజానికి సూపర్ స్టార్ అని మగ హీరోలకు వాడుతూ ఉంటారు. కానీ నయనతార ఆడ స్టార్ కదా! అందుకని లేడీస్ సూపర్ స్టార్ ప్రత్యేకంగా అంటుంటారు అయినా సరే పిలవకూడదు అంటుంది మాళవిక..దీంతో మాళవికపై నయనతార ఫ్యాన్స్ ట్రోలింగ్ కు దిగారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో మాళవిక మళ్ళీ స్పందించింది. నయనతారంటే నాకూ గౌరవమే. కానీ నేను మాట్లాడేది ఆడ తారలపై వివక్ష గురించి.. సూపర్ స్టార్ అంటే సూపర్ స్టారే, మళ్ళీ లేడీ, జంట్ అనే తేడా ఏమిటి? దీపికా పదుకోన్, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి వారు కూడా సూపర్ స్టార్లు…అలాగే అందర్నీ పిలవచ్చు అని కవర్ చేసుకొచ్చింది. ఇలా గోక్కోవడం దేనికి? మళ్లీ దానిపై ఈ ఆయిల్ రాసుకోవడం దేనికి?