Pawan Kalyan with son Akira Nandan: పవన్ కళ్యాణ్ తో అకీరా నందన్ కలిసి ఉన్న ఫోటో తాజాగా వైరల్ అవుతుంది. అకీరా నందన్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే సోమవారం నాడు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే అంటూ అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. ఈ స్కూల్ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయడం విశేషం. మొత్తానికి అకీరా నందన్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డేలో పవన్ మెరిశాడు. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్, అకీరా నందన్, ఆద్యలు ఇలా ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ‘అకీరా నందన్’ సన్నద్ధం అవుతున్నాడు అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే, అకీరా ఎలాంటి కథతో రాబోతున్నాడు అని అందరికీ ఉన్న ఆసక్తి. కాగా ఆ మధ్య టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ‘నీరజ్ చోప్రా’ బయోపిక్ తీయాలని చాలామంది ప్లాన్ చేశారు. ఆ విజేత ఆత్మ కథనే సినిమాగా తీయాలని సినిమా వాళ్ళు ఉత్సాహ పడుతున్నారు. ‘నీరజ్ చోప్రా’ కథ వింటే ఎవరిలోనైనా ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంది. అతని జీవితంలో గొప్ప పోరాటం ఉంది. చిన్న తనం నుండే.. అతను కాలంతో యుద్ధం చేశాడు. క్షణక్షణం తన పరిధిని పరిమితిని పెంచుకుంటూ పోయాడు.
Also Read: Pavan Benefit From Mega Enthusiasm: మెగా ఉత్సాహంతో పవన్ కు మేలు జరిగేనా?
అన్నిటికీ మించి మరెన్నో మలుపులు నీరజ్ జీవితంలో ఉన్నాయి. కష్టాలు అవమానాలు మధ్య అతను జీవితం సాగింది. అతను అనుభవించిన ప్రతి బాధను తన విజయానికి పునాదిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా ఒక సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు నీరజ్ జీవితంలో ఉన్నాయి. అందుకే, అతని కథలో కల్పితాలు కలపక్కర్లేదు.

ఉన్న నిజాన్ని ఉన్నట్టుగానే చెప్పినా.. అద్భుతమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అవుతుంది ఆ సినిమా. అయితే, నీరజ్ ఫిజిక్, వయసుకు అతని బయోపిక్ లో కరెక్ట్ గా సరిపోయే కొత్త నటుడు అంటే ‘అకీరా నందన్’నే గుర్తుకువస్తున్నాడట. పైగా , ఫిజిక్ అండ్ ఏజ్ పరంగా అకీరా నందన్, నీరజ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. పైగా పవర్ స్టార్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ‘అకీరా నందన్’కి ఇంతకుమించిన గొప్ప కథ దొరకదు. మరి, పవన్ ఫ్యాన్స్ సంతోషం కోసమైనా ‘అకీరా నందన్’, నీరజ్ చోప్రా పాత్రలో నటిస్తాడేమో చూడాలి.
Also Read: Mega Fans Unity: జగన్ తో చిరు కటీఫ్.. పవన్ కు సపోర్ట్? అల్లు అర్జున్‌ని సైతం మెగా ఫ్యాన్స్ తిరస్కరించారా?
Recommended videos
[…] […]
[…] […]