spot_img
Homeఎంటర్టైన్మెంట్Rao Bahadur Movie Review: 'రావు బహదూర్' ఫుల్ మూవీ రివ్యూ... బొమ్మ హిట్టా..ఫట్టా..

Rao Bahadur Movie Review: ‘రావు బహదూర్’ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా..ఫట్టా..

Rao Bahadur Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ పాల్ లతో సంబంధం లేకుండా కొత్త కథలను ట్రై చేస్తూ తన నట పొటెన్షియాలిటీ చూపిస్తున్న నటుడు సత్యదేవ్… ఇప్పుడు మరోసారి ‘రావు బహదూర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

కథ

‘రామప్ప రాజు రావు బహదూర్’ (సత్యదేవ్) లివర్ క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉండి హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతాడు… డాక్టర్స్ అందరు ఆయన మరో 2 నెలల కంటే ఎక్కువ బతకడని చెబుతారు…కానీ ఆయన ఒక సంవత్సరం కి మించి బతుకుతాడు… అది కూడా రోజు మందు తాగుతూ అలా ఎలా బతుకుతున్నాడు. ఇలా ఒక మనిషి బతకడం అనేది మెడికల్ మిరాకిల్ అని డాక్టర్లు భావిస్తారు… ఇక రావు బహదూర్ మాత్రం కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటాడు. చివరగా ఆయనకి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తాడు… తను దేనికోసం అయితే ట్రై చేస్తున్నాడో అది ఆయనకి దొరికిందా..? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమాని విజువల్ గా స్క్రీన్ మీద చాలా ఎఫెక్ట్ గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేకపోవడం అది కూడా సింగిల్ పాయింట్ అవ్వడం వల్ల సినిమాని చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి ప్రతి సీను లాగ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సినిమా ఇంట్రడక్షన్ సీన్ లోనే విజువల్ గా చాలా అద్భుతంగా క్రియేట్ చేసిన వెంకటేష్ మహా ఆ తర్వాత సినిమాని అంతే రేంజ్ లో రూపొందించడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సినిమాలో వచ్చే ప్రతి సీన్ లాగ్ అవుతూనే ఉంటుంది. ఒక్క సీన్ లో కూడా హై ఇచ్చే ఎమోషన్ అయితే మనకు కనిపించదు.

గ్రాఫ్ మొత్తం ఒకే రేంజ్ లో వెళ్తుంది తప్ప ఒక్కచోట కూడా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉండవు… డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. వాటిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా నచ్చింది. కానీ ఇందులోనే కాన్ఫ్లిక్ట్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా రాసుకొని ఉంటే బాగుండేది. కథ పెద్దగా ఎఫెక్టివ్ గా లేకపోవడం లొకేషన్లు కూడా పెద్దగా చేంజెస్ లేవు. 90% ఒకే ఇంటిలో తీయడం వల్ల సినిమా చూస్తున్నంత సేపు బోర్ గానే అనిపిస్తుంది. ఎంతసేపు అవే నాలుగు క్యారెక్టర్లతో సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. కాబట్టి సినిమా చూసే ప్రేక్షకుడికి ఇదొక పెద్ద పరీక్ష అనే చెప్పాలి. సినిమా రన్ టైం కూడా ఎక్కువగా ఉండటం వల్ల సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ అయితే ప్రేక్షకుడికి కలుగుతుంది.

ఫస్టాఫ్ లో అక్కడక్కడ ఇంట్లో పని ఆవిడ చేసే కామెడీ, సత్యదేవ్ మాటల్లో నుంచి వచ్చే ఫన్ వల్ల ప్రేక్షకులు కొంతవరకు రిలాక్స్ అవుతారు. అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఒక సాంగ్ ఫన్నీ ఎపిసోడ్స్ కూడా సినిమాకి కొంతవరకు ప్లస్ అయ్యాయనే చెప్పాలి. కానీ సెకండాఫ్ స్టార్టింగ్ నుంచే బోరింగ్ సన్నివేశాలు వస్తాయి…నిజానికి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే వాళ్లకు ఈ సినిమా అయితే అస్సలు నచ్చదు. మలయాళం ఫ్లేవర్ లో సినిమాలను ఇష్టపడే వాళ్ళకి కొంతవరకు నచ్చవచ్చు…

ఆర్టిస్టుల పెర్ఫామెన్

ఈ సినిమాలో సత్యదేవ్ జీవించాడనే చెప్పాలి. ఏజ్ ఫ్యాక్టరీ ఉన్న క్యారెక్టర్ లో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఆయన రెండు మూడు వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ఈ సినిమా మొత్తానికి ఏదైనా హైలెట్ ఉంది అంటే సత్యదేవ్ యాక్టింగ్ అనే చెప్పాలి… ఇక సత్యదేవ్ భార్యగా నటించిన దీప థామస్ యాక్టింగ్ కూడా బాగుంది. యంగ్ గెటప్ లో తను కనిపించినప్పుడు ఆమె లుక్స్ కూడా చాలా బాగా కుదిరాయి. ఇక అచ్చాయమ్మా అనే పనావిడ పాత్రలో నటించిన ఆమె కూడా బాగా చేసింది. ఆమె కనిపించినంత సేపు సినిమాలో కాస్త రిలాక్సేషన్ దొరికింది… సత్యదేవ్ ఫ్రెండ్ గా నటించిన నటుడు సైతం తన నటనతో మెప్పించాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

మ్యూజిక్ కొంతవరకు పర్లేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది… ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ ను ఇంకా షార్ప్ గా కట్ చేయాల్సింది… సీజీ వర్క్ బాగా కుదిరింది, ఆర్ట్ వర్క్ బాగా సెట్ అయింది. 1960 లలో ఉండే వస్తువులను బాగా రిక్రియేట్ చేశారు. అలాగే 1991 లో ఉండే వస్తువులను బాగా చూపించారు…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…

ప్లస్ పాయింట్స్

సత్య దేవ్ యాక్టింగ్
టెక్నికల్ వర్క్స్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

కథ
లాగ్ సీన్స్
హై ఎమోషనల్ సీన్స్ లేకపోవడం
బోరింగ్ సన్నివేశాలు…

రేటింగ్ : 2.25

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular