Homeఎంటర్టైన్మెంట్Rao Bahadur First Review: 'రావు బహదూర్' మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది.. ఇలాంటి కాన్సెప్ట్ తో...

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’ మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది.. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా ఊహించడం కూడా కష్టమే..

Rao Bahadur First Review: మన టాలీవుడ్ లో ప్రేక్షకులకు ఎల్లప్పుడూ సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలని తపన పడే హీరోల్లో ఒకరు సత్య దేవ్. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన , ఆ తర్వాత హీరో గా మారి , డిఫరెంట్ సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ, తనలోని నటన ప్రతిభకు సానపెడుతూ, గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన చిత్రం ‘రావు బహదూర్’. మహేష్ బాబు నిర్మాణ సంస్థ లో, ‘C/O కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ఇది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే నెల 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని హైదరాబాద్ లో కొంతమంది సినీ ప్రముఖులకు , మీడియా మిత్రులకు వేసి చూపించారు.

ఈ షోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా విచ్చేశారు. ఈ సినిమాని చూసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘రావు బహదూర్.. ఇది కేవలం మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలా చేసే చిత్రం మాత్రమే కాదు, మీ నరనరాల్లో గూస్ బంప్స్ రప్పించే సినిమా. స్టన్నింగ్ విజువల్స్ తో , అద్భుతమైన డ్రామా తో , ఒక ప్రపంచాన్నే సృష్టించారు. ఆ ప్రపంచం లో హీరో సత్యదేవ్ ధ్రువతార లాగా మురిసిపోయారు. అతని కన్నా ఈ పాత్రని ఇండస్ట్రీ లో ఎవ్వరూ బాగా చెయ్యలేరు రేంజ్ లో నటించారు. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు నాకు చాలా గర్వం గా ఉంది. జులై 3 న ఈ అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

సాధారణంగా మహేష్ బాబు నిజంగా థ్రిల్ కి గురి చేస్తేనే ఇలాంటి ట్వీట్స్ వేస్తుంటారు. ఆయన జడ్జిమెంట్, రివ్యూస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి అనేది అందరి నమ్మకం. ఈ సినిమాకు ఆయన ఆ రేంజ్ రివ్యూ ఇచ్చారంటే , కచ్చితంగా ఇది అద్భుతమైన సినిమానే అనేది అర్థం అవుతోంది. కరువులో ఉన్న టాలీవుడ్ కి ‘పెద్ది’ చిత్రం కొత్త ఊపిరి పోసింది. ఆ తర్వాత విడుదలైన సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ఇచ్చిన ఊపుని ‘రావు బహదూర్’ కొనసాగిస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version