Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi : మళ్లీ సూర్య వంశీకి హ్యాండ్ ఇచ్చిన గంభీర్.. ఇద్దరు కొత్త వాళ్లకు...

Vaibhav Suryavanshi : మళ్లీ సూర్య వంశీకి హ్యాండ్ ఇచ్చిన గంభీర్.. ఇద్దరు కొత్త వాళ్లకు ఛాన్స్

Vaibhav Suryavanshi : గౌతమ్ గంభీర్ కు ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నాడు.. కనీసం మేనేజ్మెంట్ కూడా ఏమీ చేయలేకపోతోందా.. అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోతోందా.. పరిణామాలను చూస్తుంటే అదే విధంగా అనిపిస్తున్నాయి. జట్టులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చివరికి ఏం చేయబోతున్నారో కూడా తెలియడం లేదు.

గౌతమ్ గంభీర్ వైభవ్ సూర్య వంశీ విషయంలో వ్యవహరిస్తున్న తీరు మాజీ క్రికెటర్లకు కూడా అంతు పట్టడం లేదు. అసలు గౌతమ్ గంభీర్ అలా ఎందుకు చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఓడిపోయింది.

సూర్య వంశీ కి తొలి మ్యాచ్లో అవకాశం ఇవ్వకపోవడంతో గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. జట్టులో అతడికి చోటు లభించకపోవడంతో ఆ ప్రభావం స్కోర్ మీద పడింది. ఐర్లాండ్ బౌలర్లను ప్రతిఘటించడంలో టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ మినహా మిగతా వారంతా చేతులెత్తేశారు. పెద్ద పెద్ద బౌలర్ల మీద భీకరమైన ఇన్నింగ్స్ ఆడిన మన బ్యాటర్లు.. అనా మక ఐర్లాండ్ బౌలర్ల ముందు తలవంచారు. వాస్తవానికి సూర్య వంశీకి గనక చోటు కల్పిస్తే తొలి మ్యాచ్ ఫలితం వేరే విధంగా ఉండేది. కానీ గౌతమ్ గంభీర్ నిర్లక్ష్యం వల్ల టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది.

తొలి మ్యాచ్లో అవకాశం లభించలేదనుకుంటే.. రెండో మ్యాచ్లో కూడా సూర్య వంశీ రిజర్వ్ బెంచ్ పరిమితం కావలసి వచ్చింది. అతడికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు ఇప్పటికీ అర్థం కావడం లేదు. వాస్తవానికి ఈ సిరీస్ ద్వారా జాతీయ జట్టులోకి అతడు ప్రవేశిస్తాడని అందరు అనుకున్నారు. పైగా ఆడే అవకాశం కల్పిస్తామని చెబితేనే సూర్య వంశీ తల్లిదండ్రులను ఐర్లాండ్ కు బీసీసీఐ పంపించింది. కానీ అతనికి అవకాశాలు ఇవ్వకుండా గౌతమ్ గంభీర్ గేమ్స్ ప్లే చేస్తున్నాడు. సూర్య వంశీ కి రెండో మ్యాచ్లో చోటు ఇవ్వకపోగా… వాషింగ్టన్ సుందర్.. ప్రసిద్ కృష్ణ ను పక్కనపెట్టి ప్రిన్స్ యాదవ్.. సూర్యాంష్ కు అవకాశం కల్పించాడు గౌతమ్ గంభీర్. దీంతో అతడి తీరు పట్ల విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అసలు ఏం చేద్దాం అనుకొని అతడికి జట్టులో అవకాశం కల్పించారు.. చివరికి ఇలా డ్రింక్స్ బాయ్ గా పని చేయడానికి.. బంగారపు హుండీని చిల్లర వేయడానికి ఉపయోగిస్తున్నారని సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version