Deepika Padukone- Ranveer Singh: బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ వ్యవహారం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎవరు ఎవరికీ బాయ్ ఫ్రెండ్, ఎవరు ఎవరికీ గర్ల్ ఫ్రెండ్ అనే విషయంలో డౌట్ చాలా మందికి ఉంటుంది. ఈ ముచ్చట కాసేపు పక్కన పెడితే. దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే దీపికా పదుకొనె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్ హోదా లో కొనసాగడం విశేషం.
పెళ్ళికి ముందు దాదాపు నాలుగేళ్ల సహజీవనం చేసిన ఈ జంట 2018 నవంబర్ 14 న తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధం గా మార్చుకున్నారు.వీరి పెళ్లి తర్వాత బాలీవుడ్ లో ఎందరో హీరో హీరోయిన్స్ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక రణ్వీర్ తో ప్రేమకు ముందు దీపిక పదుకొనె పలువురితో ప్రేమాయణం సాగించినట్లు అందరికి తెలిసిందే. ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్ అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేసినట్లు వినికిడి.
తాజాగా ఈ విషయాలపై రణ్వీర్ సింగ్ ఒక ఇంటర్వ్యూ లో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. రాణీ ఔర్ రామ్ కీ ప్రేమ్ కహానీ లో నటించిన రణ్వీర్ ఆ సినిమా ఇంటర్వ్యూ లో భాగంగా తమ ప్రేమ పెళ్లి గురించి, దీపిక పదుకొనె ప్రేమ విషయాల గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. దీపికా నాతో చాలా ఓపెన్ గా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. తన పాస్ట్ లవ్ స్టోరీస్ కూడా నాకు చెప్పేసింది. నిజమైన ప్రేమలో ఎలాంటి దాపరికాలు ఉండొద్దనేది మా ఇద్దరి అభిప్రాయం. అందుకే నేను కూడా అన్ని ఓపెన్ గానే దీపికతో పంచుకుంటాను అంటూ తెలిపాడు రణ్ వీర్ సింగ్.
పెళ్ళికి ముందు దాదాపు నాలుగేళ్లు సహజీవనం చేశారు కాబట్టి ఒకరి గురించి మరొకరు బాగానే తెలిసి ఉంటుంది. అందుకే పెళ్ళై ఐదారేళ్ల అవుతున్న ఎక్కడ ఎలాంటి ఇష్యూ లు లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక దీపిక విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియా లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ జవాన్ మూవీలో దీపికా గెస్ట్ రోల్ చేసింది. ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది. అదే విధంగా ఫైటర్, ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా “కల్కి 2898 AD” లో హీరోయిన్ గా నటిస్తుంది.