Homeఎంటర్టైన్మెంట్Ranveer Singh: ప్చ్.. స్టార్ హీరో న్యూడ్ ఫోటో మార్ఫింగ్ చేశారట

Ranveer Singh: ప్చ్.. స్టార్ హీరో న్యూడ్ ఫోటో మార్ఫింగ్ చేశారట

Ranveer Singh: బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ కి నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలవడం అలవాటు పోయింది. ఇతగాడికి స్టార్ డమ్ ఎంత ఉంది అనే సంగతి పక్కన పెడితే.. తనను తాను మాత్రం బాగా ప్రమోట్ చేసుకుంటాడు. ఈ క్రమంలో గుర్తింపు కోసం అప్పుడ‌ప్పుడు కాంట్ర‌వ‌ర్సీస్‌తో హాట్ టాపిక్‌ గా కూడా నిలవడానికి మొహమాట పడడు. ఇటీవల ఓ మ్యాగజైన్‌ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా ఈ హీరో గారు న్యూడ్‌ ఫొటోలకు ఫోజులిచ్చాడు.

Ranveer Singh
Ranveer Singh

ఆ ఫోజులు ఇచ్చి.. పైగా తాను ఏదో పెద్ద ఘనకార్యం చేసినవాడిలా తెగ ఫోజులు ఇచ్చాడు. కట్ చేస్తే.. ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ తర్వాత పలువురు రణ్‌వీర్‌ సింగ్‌పై మండిపడ్డారు. అతని పై ఎన్నో విమర్శలు వచ్చాయి. భారతదేశంలోని సాంప్రదాయ వాదులు అంతా ఈ ఫోటోలను తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇలా బట్టలు లేకుండా కెమెరాకి ఫోజులు ఇవ్వడం భారతీయ సాంప్రదాయానికి విరుద్ధమని, ఇలాంటి చేష్టలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయని సాంప్రదాయ వాదులు కొందరు గట్టిగా వాదించారు. పైగా ర‌ణ్‌వీర్ సింగ్ పై పోరాటానికి కూడా దిగారు. ఈ క్రమంలో న్యాయ పోరాటానికి కూడా కసరత్తులు చేశారు. ఫలితంగా ర‌ణ్‌వీర్ సింగ్ న్యూడ్ షోపై వ్యతిరేకత ఎక్కువ అయ్యింది.

Ranveer Singh
Ranveer Singh

ఓ దశలో ర‌ణ్‌వీర్ సింగ్ ఇంటి ముందు కొందరు ఆందోళన చేయడం కూడా జరిగింది. ఎవరెన్ని చేసినా ఇన్నాళ్లు ర‌ణ్‌వీర్ సింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ రంగంలోకి దిగారు కొందరు సాంప్రదాయ వాదులు. అతని పై విరుచుకు పడ్డారు. పైగా అతనిని ఇరకాటంలో పడేసేలా చర్యలు చేపట్టారు. దాంతో ర‌ణ్‌వీర్ సింగ్ తగ్గాడు. తన ఫొటోను మార్ఫింగ్ చేశారని తాజాగా రణ్‌వీర్ సింగ్ వెల్లడించాడు.

ఫొటోషూట్‌లో పాల్గొన్న ఫొటోల్లో ఒకదానిని టాంపరింగ్ చేసి మార్ఫింగ్ చేశారని ఈ హీరో ఆరోపించాడు. ఫొటోషూట్ కేసు దర్యాప్తులో భాగంగా రణ్‌వీర్‌ను పోలీసు అధికారులు వివరణ కోరారు. దీంతో విచారణలో ఇతగాడు ఈ విషయం తెలిపాడు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా తన ఫొటోషూట్ ఉందని అతడిపై కేసు నమోదైంది. ఈ ఫొటోషూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version