Rangabali Movie Collections
Rangabali Movie Collections: యంగ్ హీరోలలో టాలెంట్ , అందం అన్నీ ఉన్నప్పటికీ సరైన సక్సెస్ లేక ఇంకా ఇండస్ట్రీ లో వెనుకబడిన హీరోల జాబితా తీస్తే అందులో నాగ శౌర్య పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘ఊహలు గుసగుస లాడే ‘ అనే సినిమా తో ఇండస్ట్రీ లోకి లాంచ్ అయ్యాడు. ఆ సినిమా పెద్ద అయ్యేలోపు, అందరి దృష్టిలో పడ్డాడు నాగ శౌర్య. కుర్రాడు చాలా బాగున్నాడు, యాక్టింగ్ కూడా అదరగొట్టేసాడు, కచ్చితంగా ఇతడు ఇండస్ట్రీ లో మరో నాని రేంజ్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు.
కానీ ఆ సినిమా తర్వాత ఈయన నటించిన చిత్రాలలో కేవలం చలో అనే చిత్రం మాత్రమే హిట్ అయ్యింది. మిగిలిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈసారి కమర్షియల్ గా ట్రై చేద్దామని ‘రంగబలి’ చిత్రం చేసాడు. విడుదలకు ముందు వినూతన రీతిలో ప్రొమొతిఒన్స్ చేసి ఈ చిత్రం పై బజ్ క్రియేట్ చెయ్యడం లో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
కానీ కంటెంట్ లేని సినిమాకి ఎన్ని ప్రొమోషన్స్ చేసిన వృధా ప్రయత్నాలే అని మరోసారి ఈ చిత్రం రుజువు చేసింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ తేలిపోవడం తో ఓపెనింగ్స్ దగ్గర నుండే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బాగా వెనుకబడిపోయింది. అందుకే విడుదలై వారం రోజులు కూడా గడవక ముందే అన్నీ థియేటర్స్ నుండి ఈ చిత్రంని తీసేసారు.
6 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, వారం రోజులకు గాను 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నిన్న ఈ చిత్రానికి 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నుండి షేర్స్ వచ్చే ఛాన్స్ లేకపోవడం తో ఇదే క్లోసింగ్ కలెక్షన్స్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇలా వరుసగా ఫ్లాప్ సినిమాలు చేసే బదులు రిటైర్ అయిపోవచ్చు కదా అని నాగ శౌర్య పై సెటైర్స్ వేస్తున్నారు నెటిజెన్స్.