
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’.. ‘ఆచార్య’ మూవీల్లో నటిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ రెండు సినిమాలు నిలిచిపోయిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన చెర్రీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు. అందుకు సంబంధించిన పిక్స్.. వీడియోలను రాంచరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను అలరించాడు.
Also Read: వైరల్: అన్నయ్యను తలుచుకొని మహేష్ ఎమోషనల్
ఇదే సమయంలో రాంచరణ్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. కరోనా టైంలో అందరికీ హీరోల్లాగానే రాంచరణ్ కూడా చాలా కథలను విన్నట్లు తెలుస్తోంది. వీటిలో రాంచరణ్ కు ఒక కథ బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్ఆర్ఆర్.. ఆచార్య తర్వాత చరణ్ ఆ సినిమాలోనే నటిస్తాడనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరుగా విన్పిస్తోంది.
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాంచరణ్ క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో ఇందుకు తగ్గట్టుగా రాంచరణ్ తన తదుపరి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాంచరణ్ పాన్ ఇండియా సినిమాలను చేసేందుకు మొగ్గుచూపుతున్నాడు. అలాంటి కథలకే చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
తమిళంలో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న మోహన్ రాజా ఇటీవల రాంచరణ్ ను కలిసి ఓ కథ విన్పించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య పాన్ ఇండియా స్థాయి కథ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా తమిళంలో మోహన్ రాజా తెరకెక్కించిన ‘తని ఒరువన్’ రీమేక్ చిత్రాన్ని రాంచరణ్ తెలుగులో ‘ధృవ’గా నటించి సూపర్ హిట్టందుకున్నాడు.
Also Read: ఆ హీరోయిన్లకు ‘బ్రేకప్’..ఇలా కలిసొచ్చిందా?
ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కలయికలో పాన్ ఇండియా మూవీ త్వరలో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. మోహన్ రాజాతోపాటు పలువురు తెలుగు దర్శకులు రాంచరణ్ తో పాన్ ఇండియా మూవీలు చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎవరీ దర్శకత్వంలో నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.