Ranbir Kapoor Ramayana: ఎన్నిసార్లు చూసినా, ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా మైమరిచిపోయే గాఢ రామాయణం. ఈ కథలో ఒక వైభోగం ఉంటుంది, ఒక సంబరం ఉంటుంది, హృదాలయాలను కలిచి వేసే విషాదకరమైన సంఘటనలు ఉంటాయి, ఓవరాల్ గా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది ఈ కథ. సరిగ్గా వెండితెర పై ఈ కథను ఆవిష్కరిస్తే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎవ్వరి ఊహకు అందనంత ఎక్కువ వస్తాయి. ప్రభాస్(Rebel Star Prabhas) ‘ఆదిపురుష్’ చిత్రానికి బంగారం లాంటి అవకాశం వచ్చింది. ఆ సినిమాలోని పాటలు కూడా ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. కానీ దర్శకుడు ఓం రౌత్ చరిత్రని వక్రీకరిస్తూ సినిమాని తీసి ప్రభాస్ పరువు తీసేలా చేసాడు. ఫలితంగా ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇప్పుడు ఆ తప్పు చేయకుండా బాలీవుడ్ దర్శకుడు భారీ బడ్జెట్ తో రామాయణం ని మూడు భాగాలుగా రణబీర్ కపూర్(Ranbir Kapoor) తో తెరకెక్కిస్తున్నాడు.
Also Read: Dil Raju Brother: గేమ్ చేంజర్ ఫెయిలైనా.. చరణ్ ఎందుకు పట్టించుకోలేదు? – నిర్మాత శిరీష్
ఈ చిత్రం లో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి(Sai Pallavi), రావణుడిగా రాకింగ్ స్టార్ యాష్(Rocking star Yash), మండోదరి గా కాజల్ అగర్వాల్(Kajal Agarwal), హనుమంతుడిగా సన్నీ డియోల్(Sunny Deol), సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్ వీడియో ని ఎల్లుండి,అనగా జులై 3 వ తేదీన విడుదల చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తున్నారని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఈ చిత్ర నిర్మాణం లో రావణుడిగా నటిస్తున్న యాష్ కూడా భాగం అయ్యాడట. అయితే ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ ని సూర్పనక్క గా చూపించడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు అవుతుంది. అంతటి అందమైన హీరోయిన్ ని చూపిస్తే సీతగా చూపించాలి కానీ, రాక్షసి పాత్రలో చూపిస్తారా అంటూ మండిపడుతున్నారు.
Finally #Ramayana glimpse on July 3rd
This will be epic in Indian cinema #SaiPallavi #RanbirKapoor #Yash pic.twitter.com/mhIvxL7rf1— SaiPallavi fan girl (@shobara39291954) June 30, 2025
అంత పెద్ద స్టార్ హీరోయిన్ కి తగిన పాత్ర కాదని, అసలు రకుల్ ఇలాంటి రోల్ చేయడానికి ఎలా ఒప్పుకుందో అర్థం కావడం లేదని ఆమె అభిమానులు అంటున్నారు. ఇకపోతే ఈ రామాయణం సిరీస్ లోని మొదటి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ రాముడి జననం నుండి, ఆయన తనువూ చాలించే వరకు జరిగిన మొత్తాన్ని ఈ మూడు భాగాల్లో చూపించబోతున్నారట. ఎల్లుండి విడుదల చేయబోయే గ్లింప్స్ వీడియో లో ఈ సినిమా లో నటించిన నటీనటుల పాత్రలను పరిచయం చేస్తారని,అంతే కాకుండా సినిమా ని ఎంతటి ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారో అర్థం అయ్యేలా ఈ గ్లింప్స్ వీడియో చేస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజం అవ్వబోతుంది అనేది. మంచి రక్తి కట్టించే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే మన ఇండియన్ సినిమా హాలీవుడ్ ని సైతం సవాలు చేసే వసూళ్లను రాబడుతుందని అంటున్నారు విశ్లేషకులు.