Rana Wife: ‘బాహుబలి’ మూవీతో దగ్గుపాటి రానా పాన్ ఇండియా స్టార్ ఎదిగిపోయాడు. ఓవైపు హీరోగా చేస్తూనే ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ‘అరణ్య’ మూవీ తర్వాత రానా నటిస్తున్న చిత్రం ‘బీమ్లానాయక్’. మల్టిస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కల్యాణ్ కు ధీటైన పాత్రలో రానా దగ్గుపాటి నటిస్తుండటం విశేషం.

పాన్ ఇండియా తరహాలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘బీమ్లానాయక్’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. పవన్ కల్యాణ్ సరసన కేరళకుట్టి నిత్యమీనన్ నటిస్తుండగా రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ మూవీ నుంచి తాజాగా ‘అడవి తల్లి పాట’ రిలీజైంది. ఈ పాటలో రానా భార్యగా సంయుక్త మీనన్ కన్పించింది. దీంతో ఆమె గురించి తెలుసుకునే అభిమానులు ఆసక్తి కనబరుస్తూ నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.
హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా కేరళకుట్టినే. 2016లో ‘పాప్ కార్న్’ అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్లామర్ తోపాటు మంచి నటనను కనబర్చడంతో ఆమెకు సౌత్ ఇండియాలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పలు సినిమాలతో బీజీగా ఉన్న సమయంలో దర్శకుడు సాగర్ చంద్ర ‘బీమ్లానాయక్’ మూవీలో ఆఫర్ ఇచ్చారు.
ఈ మూవీలో రానా భార్య పాత్రలో సంయుక్త మీనన్ కనువిందు చేయనుంది. అడవితల్లి పాట చూసిన అభిమానులను ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. దీంతో సంయుక్త పేరు గూగుల్లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ షూరు చేశారు.
Also Read: Good Luck Sakhi: కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రానికి ఏమైంది… మరోసారి విడుదల తేదీ వాయిదా
‘బీమ్లానాయక్’ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ అనే మలయళీ మూవీకి రీమేక్ గా రాబోతుంది. ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ కాగా తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాను తెలుగు నెటివీటికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ సినిమాపై అంచనాలను భారీ పెంచేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Balayya: అక్కడ కూడా రికార్డుల మోత మోగిస్తోన్న బాలయ్య !