Rajamouli: దర్శకుడు అంటే ఎలా ఉండాలి ? తెలుగు చిత్రసీమలోనే కాదు, ఇండియాలో ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి పోయినా.. ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం మాత్రం ఒక్కటే. అదే రాజమౌళి. దర్శకత్వానికి రాజమౌళి పర్యాయపదం అయ్యాడు. చాలామంది గొప్ప దర్శకులు ఉన్నారు. కానీ, రాజమౌళి లాంటి దర్శకుడు మాత్రం రాజమౌళి ఒక్కడే ఉన్నాడు. అందుకే, గొప్ప గొప్ప దర్శకులు కూడా రాజమౌళి తీసిన బాహుబలి సినిమాని చూసి స్ఫూర్తి పొందారు.

అలాగే అంత గొప్ప సినిమాని ఒక ప్రాంతీయ సినిమా డైరెక్టర్ ఎలా తీయగలిగాడు ? అని నేషనల్ రేంజ్ డైరెక్టర్లు రాజమౌళిని చూసి అసూయ చెందారు. అయినా భారీ ప్రయత్నాలు చేయాలంటే కావాల్సింది వందల కోట్ల బడ్జెట్ కాదు, గుండె దైర్యం. అవసరం అయితే సినిమా కోసం అన్నీ వదులుకోవడానికి కూడా సిద్ధపడటం. అది రాజమౌళి చేయగలడు.
అందుకే, రాజమౌళి ఏ గొప్ప ప్రయత్నం చేసినా సిన్సియర్‌గా చేస్తాడు. విజయాలు కూడా రాజమౌళికి అలాగే వస్తాయి. అలాగే మిగిలిన డైరెక్టర్స్ కి వస్తాయంటే చెప్పలేం. నిజానికి బాహుబలి సినిమాని చూసి.. ఆ సినిమాని మించిపోయేలా సినిమా చేస్తాం అంటూ కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందడుగు వేశారు. అయితే, ఎవ్వరూ కూడా రాజమౌళిలా మ్యాజిక్ క్రియేట్ చేయలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డారు.
బాహుబలి తరహా భారీ చిత్రాలు వివిధ భాషల్లో కొన్ని వచ్చాయి. కానీ, ఒక్కటి కూడా హిట్ కాలేదు. తాజాగా ‘మరక్కార్’ అంటూ ఒక సినిమా వచ్చింది. దీన్ని మలయాళ బాహుబలిగా బాగా ప్రమోట్ చేశారు. పైగా మలయాళ సినీ పరిశ్రమ కూడా ఈ సినిమాని తమ ప్రతిష్ఠ అన్నట్టుగా ఓన్ చేసుకుంది. కారణం.. వంద కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించారు.
అన్నిటికీ మించి విడుదలకు ముందే ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. దాంతో ఈ భారీ చిత్రం పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక, లోకల్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కూడా రాలేదు. కథలో దమ్ము లేదన్నారు, కథనంలో సొమ్ములు తెచ్చే ఊపు లేదన్నారు.
Also Read: Ramarao On Duty: రవితేజ ”రామారావు ఆన్ డ్యూటీ” విడుదల తేదీ ఖరారు…
ఇక హీరోకి ఎలివేషన్లు లేవు అన్నారు, పాత్రల మధ్య బలమైన డ్రామా లేదన్నారు. సినిమా చూసిన వారంతా ఇలా ఏదొక రకంగా నెగటివ్ గా అన్నవాళ్ళే ఎక్కువ. ఈ చిత్రం రిజల్ట్ వచ్చాకే, మొత్తానికి రాజమౌళి గొప్పదనం ఏమిటో మరోసారి జాతీయ స్థాయిలో ఘనంగా అర్ధం అయింది అందరికి.
Also Read: Sirivennela: పద్మ శ్రీ సిరివెన్నెల ఒక పాటకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతంటే?