Rana Naidu Teaser: వెంకటేష్ – రానా కలయికలో సినిమా వస్తే చూడాలని దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. వీరి కాంబినేషన్ లో రానున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ హిందీ టీజర్ ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. “సాయం కావాలా?” అని రానా డైలాగ్స్ తో ఈ టీజర్ స్టార్ట్ అయింది. అనంతరం వెంకటేష్ జైల్లో నుండి రిలీజ్ అవుతున్నట్లు చూపించారు. వయసు మళ్ళిన పాత్రలో వెంకటేష్ లుక్ చాలా కొత్తగా ఉంది. వెంకీ కెరీర్ లోనే ఈ లుక్ సంచలనాలు క్రియేట్ చేసేలా ఉంది.

ఇక వెంకటేష్, రానా దగ్గుబాటి తండ్రి, కొడుకులుగా కనిపించనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. మొత్తానికి టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. “మీ సాయం గురించి మేమెంతో విన్నాం. సెలబ్రెటీ ఎవరైనా సమస్యల్లో ఉంటే వారు మీకే ఫోన్ చేస్తారు. ఫిక్సర్ ఫర్ ది స్టార్స్, రానా భాగమయ్యాడంటే అది భారీ కుంభకోణమే అయి ఉంటుందని ఈ నగరం మొత్తం చెప్పుకుంటోంది.” అనే మాటలు రానా క్యారెక్టర్ గురించి తెలియజేస్తున్నాయి.
అయితే, వెంకటేశ్ వృద్ధుడి పాత్రలో తెల్లటి జుట్టుతో కనిపించడమే ఈ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఇక టీజర్ చివర్లో వెంకీ – రానా మధ్య వచ్చే సన్నివేశాల షాట్స్ కూడా బాగా మెప్పించేలా ఉన్నాయి. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురంలో ఓ పాటలో రానా, వెంకటేశ్ కలిసి నటించారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అందరి పాత్రలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయని తెలుస్తోంది.

అన్నట్టు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ రీఎంట్రీ ఇవ్వబోతుంది. కాజల్ రిక్వెస్ట్ చేస్తేనే.. రానా నిషా అగర్వాల్ ను ఈ సిరీస్ లో తీసుకున్నాడట. ఇక ఒకే తెర పై బాబాయ్ అబ్బాయ్ లను చూడాలని కుతూహలం గా ఉన్న అభిమానులకు, బాబాయ్ అబ్బాయి భారీ సర్ ప్రైజ్ లు ఇచ్చేలా ఉన్నారు.