Rana Naidu Season 2 : యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లలో ఒకటి రానా నాయుడు(Rana Naidu). విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న నాన్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ గా నిల్చింది. మొదటి సీజన్ భారీ హిట్ అవ్వడంతో రెండవ సీజన్ ని కూడా షూట్ చేశారు. ఎప్పటి నుండో రెండవ సీజన్ కోసం నెటిజెన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఒక శుభ వార్త. ఈ రెండవ సీజన్ ని వచ్చే నెల 13 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు. ఈ సీజన్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయట. అంతే కాకుండా మొదటి సీజన్ లో లేని కొత్త క్యారెక్టర్స్ రెండవ సీజన్ లో పరిచయం కాబోతున్నాయట.
Also Read : మిరాయ్’ కి పోటీగా ‘విశ్వంభర’..? తేజ సజ్జ వెనక్కి తగ్గుతాడా?
అందులో అర్జున్ రాంపాల్(Arjun Rampal) క్యారక్టర్ ఒకటి. అయితే మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అంత విమర్శలు కూడా వచ్చాయి. అడల్ట్ రేటెడ్ డైలాగ్స్ ని విక్టరీ వెంకటేష్ లాంటి హీరో నోటి చేత పలికించడం పై ప్రతీ ఒక్కరు విరుచుకుపడ్డారు. అసలు వెంకటేష్ ఇలాంటి సిరీస్ ని చేస్తాడని కలలో కూడా ఊహించలేదంటూ ఆయన్ని అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ తిట్టుకున్నారు. కానీ యూత్ ఆడియన్స్ మాత్రం ఆయన నటన ని, డైలాగ్స్ ని బాగా ఎంజాయ్ చేశారు. అయితే దశాబ్దాల నుండి వెంకటేష్ కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ కి మళ్ళీ ఎలాంటి తలవంపులు రాకుండా రెండవ సీజన్ లో బూతుల శాతం, అదే విధంగా అడల్ట్ రేటెడ్ డైలాగ్స్ శాతం బాగా తగ్గించినట్టు తెలుస్తుంది. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ చాలా బాగుంటుందని, ఎమోషనల్ కంటెంట్ కూడా చాలా ఎక్కువే అని అంటున్నారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్ నుండి వెంటనే వస్తున్న వెబ్ సిరీస్ ఇది. మొదటి సీజన్ తో నార్త్ ఇండియన్స్ లో కూడా వెంకటేష్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రెండవ సీజన్ తో ఆ క్రేజ్ రెండింతలు ఎక్కువ అయ్యేలా ఉంటుందట. తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ వచ్చిన నెలలోనే స్క్విడ్ గేమ్స్ చివరి సీజన్ కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు సిరీస్ లలో ఏది ఎక్కువగా డామినేట్ చేయబోతుందో చూడాలి.