Rajasthan Royals : ఐపీఎల్ ప్రారంభమైన సంవత్సరంలో ఛాంపియన్గా అవతరించిన రాజస్థాన్ జట్టు.. ఇప్పటికి 16 సీజన్లు పూర్తయినప్పటికీ మరొకసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. లిమిటెడ్ ప్లేయర్లతో అన్లిమిటెడ్ విజయాలు సాధించే ఆ జట్టు.. ఈ సీజన్లో మాత్రం అత్యంత దారుణంగా ఆడుతోంది. గొప్ప ప్లేయర్లను వేలంలో వదిలేసుకుంది. ఉన్నవాళ్లతో అద్భుతం చేయాలని అనుకుంది. కానీ ఆ జట్టు ఊహించింది వేరు.. వాస్తవంలో జరుగుతోంది వేరు. గత సీజన్లో ప్లే ఆఫ్ దాకా వెళ్ళినప్పటికీ.. ఈ సీజన్లో మాత్రం ముక్కి మూలిగి గ్రూప్ నుంచే ఇంటికి వచ్చింది. అంతేకాదు పాయింట్లు పట్టికలో అత్యంత దారుణంగా 9వ స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి రాజస్థాన్ జట్టు ట్రాక్ రికార్డు చూస్తే ఇలాంటి ఫలితాలు రాకూడదు. కానీ ఆ జట్టు ఆటగాళ్లు అత్యంత నిర్లక్ష్యంగా ఆడటం వల్ల జట్టు వరుస పరాజయాలను చవిచూసింది. గెలవాల్సిన మ్యాచ్లలోనూ ఓడిపోయి పరువు తీసుకుంది. తద్వారా ఐపీఎల్లో అత్యంత నిరాశ జనకమైన జట్టుగా చెత్త పేరు లిఖించుకుంది.
కచ్చితంగా తొలగిస్తారు
ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు నుంచి వచ్చే సీజన్ వరకు చాలామంది ప్లేయర్లు బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియాలో కూడా ఇదే తీరుగా కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఎందుకంటే కొంతమంది ఆటగాళ్లు జట్టులో విభేదాలు సృష్టిస్తున్నారని మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళింది. అందువల్లే వారిని సాగనంపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ ఫేస్ బౌలర్ జోప్రా ఆర్చర్ ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా అతడు అత్యంత దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. ఇక శుభం దుబే అత్యంత నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. ఆకాశ్ మద్వాల్ చెప్పుకోవడానికి ఒక గొప్ప ఇన్నింగ్స్ కూడా ఆడలేక పోయాడు. మహేష్ తీక్షణ కూడా విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్లో కూడా తన మ్యాజిక్ ప్రదర్శించలేకపోయాడు.. ఇక సందీప్ శర్మ కూడా ఏ కోణంలోనూ ఆకట్టుకోలేకపోయాడు. బంతితో సత్తా చూపించలేకపోయాడు. బ్యాట్ తో అదరగొట్టలేకపోయాడు. అందువల్లే వీరిని వచ్చే సీజన్లో కొనసాగించే అవకాశం లేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..” రాజస్థాన్ జట్టు పటిష్టమైన క్రమశిక్షణకు మారుపేరు. లిమిటెడ్ ఆటగాళ్లతో అన్లిమిటెడ్ ఆట తీరు ప్రదర్శిస్తుంది. అటువంటి జట్టు ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. వాస్తవానికి ఆ జట్టులో ఉన్న ప్లేయర్ల ప్రకారం చూసుకుంటే ఇలాంటి ఫలితం రాకూడదు. కానీ ఈసారి అలాంటి ఫలితం రావడంతో మేనేజ్మెంట్ పూర్తిగా ఆలోచనలో పడింది. అంతేకాదు ఇలాంటి పరిస్థితి కారణమైన ప్లేయర్లను దూరం పెట్టి.. వచ్చే సీజన్ కల్లా జట్టును పటిష్టం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నదని” సోషల్ మీడియాలో రాజస్థాన్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.