Miheeka Bajaj: రానా దగ్గుబాటి మిహీకా బజాజ్‌ల వివాహం ఎంత సింపుల్‌గా జరిగిందో అందరికీ తెలిసిందే. గతేడాది ఆగస్టు 8న అప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా గడిపిన రానా.. మూడుముళ్ల బంధంతో బ్యాచ్‌లర్ లైఫ్‌కు స్వస్థి చెప్పారు. అప్పట్లో కరోనా తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల రామానాయుడు స్టూడియోలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కొవిడ్ నిబంధనల ప్రకారం కేవలం 30 మంది బంధువుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు.

తెలుగు- మార్వాడీ సంప్రదాయాల్లో అంగరంగ వైభవంగా వీరి వివారం జరిగింది. తాజాగా, వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను రానా భార్య మిహీకా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే.. నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వెంకటేశ్ కుమార్తె అశ్రితతో పాటు, మంచు లక్ష్మీ సహా మరికొందరు ప్రముఖులు కామెంట్స్ చేశారు.
https://www.instagram.com/tv/CWhvBL3jJd3/?utm_source=ig_web_copy_link
కాగా, బాహుబలి సినిమా తర్వాత ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న రానా.. ఆ తర్వాత అరణ్యలో విభిన్న పాత్ర పోషించి తన నటనను పరిచయం ప్రేక్షకులను పరిచయం చేశారు. ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో డేనియల్ శేఖర్‌గా పొగరున్న వ్యక్తిగా అలరించనున్నారు రానా.
దీంతో పాటు, విరాట పర్వం సినిమాలోనూ ప్రధాన పాత్రలో నటించారు రానా. గతేడాదిలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరోనా కారణంగా పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేదు. కాగా, భీమ్లానాయక్ వచ్చే ఏడాది జనవరి12న విడుదల కానుంది.