Shyam Sinagaroy: తనదైన సహజ నటనతో అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. విభిన్న పాత్రలు, విభిన్న కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఈ చిత్రంలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే తాజా ఈ సినిమాకి నాని ఫస్ట్ ఛాయిస్ కాదంట. మొదటగా రాహుల్ “శ్యామ్ సింగ రాయ్” స్క్రిప్ట్‌ను రానా దగ్గుబాటికి వివరించాడు. అయితే రానా ఈ కథను తిరస్కరించడంతో ఆ పాత్ర నాని ఒడిలో పడింది. డైరెక్టర్ రాహుల్ రానాకు కథ చెప్పాడని, అయితే కథ విన్న రానా తన కంటే నాని ఈ పాత్రకు కరెక్ట్ గా సరిపోతారని దర్శకుడికి చెప్పాడని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అలా “శ్యామ్ సింగ రాయ్” కథ నాని దగ్గరకు వెళ్లడం, ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగిపోయిందట. ఈ చిత్రంలో జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.