లీడర్ చిత్రం తో సినీ రంగానికి పరిచయం కాబడ్డ దగ్గుబాటి రానా సోలో హీరోగా ఇంతవరకు సక్సెస్ దక్కించు కోలేదు బాహుబలి విజయం కూడా టీం కి వెళ్ళిపోయింది . ఆ క్రమంలో ఇపుడు చేస్తున్న సినిమాలు రానాకీ చాలా ముఖ్యం గా మారాయి. ప్రస్తుతం రానా చేస్తున్న విరాట పర్వం , అరణ్య లాంటి సినిమాలు హిట్ అవ్వచ్చు గాని బాహుబలి ద్వారా సంపాదించుకొన్న పాన్ ఇండియా పాపులారిటీ కి మ్యాచ్ అవ్వవు .
అందుకే రానా తండ్రి సురేష్ బాబు తనయుడు రానా నటుడిగా పేరు తెచ్చుకుని దేశ వ్యాప్తంగా పాపులర్ అవ్వాలన్న ఉద్దేశం తో ఒక భారీ బడ్జట్ సినిమా చేయాలను కొన్నాడు. ఆ క్రమంలో సురేష్ బాబు. పాన్ ఇండియా మూవీగా “ హిరణ్య కశ్యప “ సినిమా తీయాలని అనుకొంటున్నాడు .
రుద్రమదేవి ఫేమ్ గుణశేఖర్ ఈ `హిరణ్య కశ్యప ` కథ మీదే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాడు. దర్శక నిర్మాతలు ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కూడా కేటాయించాలి అనుకొంటున్నారు. . ఆమధ్య రానా ఆరోగ్య కారణాల వల్ల ఈ `హిరణ్య కశ్యప ` చిత్రం మొదలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ రానా హెల్తీ గా ఉండడంతో ` హిరణ్య కశ్యప ` సినిమా చేయడానికి ఇదే తగిన సమయం అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో వచ్చిన కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా సురేష్ బాబు చాలా నష్టపోతున్నసమయం లో అంత భారీ బడ్జట్ సినిమా తలపెట్టడం మంచిది కాదని భావిస్తున్నారట.
వెంకటేష్, రానా లతో సింపుల్ బడ్జట్ సినిమాలు తీసుకుని , రెండేళ్ల తర్వాత పరిస్థితులు కుదుట పడ్డాక అప్పుడు ` హిరణ్య కశ్యప ` చేసుకోవడం ఉత్తమం అనుకుంటున్నారట. మరి అంతవరకూ గుణశేఖర్ ఆగుతాడా లేక వేరే హీరో, నిర్మాతని వెతుక్కుంటాడా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.