https://oktelugu.com/

మరోసారి మోడ్రన్ అత్తగా సీనియర్ హాట్ బ్యూటీ !

యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. లాక్ డౌన్ కు ముందు గోవాలో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ, ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి […]

Written By:
  • admin
  • , Updated On : June 8, 2020 / 08:07 PM IST
    Follow us on

    యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. లాక్ డౌన్ కు ముందు గోవాలో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ, ఆకాష్ పూరి తల్లి పాత్రలో నటిస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందట. అంటే సినిమాలో ఆకాష్ పూరికి రమ్యకృష్ణ అత్తగా కనిపించబోతుంది అన్నమాట. గతంలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా కనిపించింది. అలాగే నాగచైతన్యకి అల్లరి నరేష్ కు కూడా రమ్యకృష్ణ మోడ్రన్ అత్తగా కనిపించి అలరించింది. ఇప్పుడు ఆకాష్ పూరి వంతు వచ్చింది.

    ఏమైనా ఇలాంటి అత్త పాత్రలను చేయడంలో ఈ జనరేషన్ లో రమ్యకృష్ణను మించినోళ్లు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ ‘రొమాంటిక్’ సినిమా నుండి ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ అయింది. హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం.. ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకోవంతో పాటు సినిమా పై కూడా అంచనాలను పెంచేసింది.

    ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. ఈ రొమాంటిక్ మూవీలో బాలీవుడ్ నటి మందిరా బేడీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మరో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.