https://oktelugu.com/

రామ్ కి తమిళ సినిమా చేయాలని ఉందట

2019 లో ” ఇస్మార్ట్ శంకర్ ” చిత్రం తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకొన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తమిళ్ చిత్రాల్లో నటించడానికి సిద్దమౌతున్నాడు. తమిళ చిత్రాలంటే ఇష్టపెడి రామ్ ప్రస్తుతం చేస్తున్న` రెడ్ ‘ మూవీ కూడా తమిళ హిట్ మూవీ `తాడం ‘ కి రీమేక్ కావడం విశేషం .కాగా ఈ చిత్రం లో రామ్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దొంగ గా , బిజినెస్ మాన్ గా రామ్ […]

Written By:
  • admin
  • , Updated On : May 11, 2020 / 04:33 PM IST
    Follow us on

    2019 లో ” ఇస్మార్ట్ శంకర్ ” చిత్రం తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకొన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తమిళ్ చిత్రాల్లో నటించడానికి సిద్దమౌతున్నాడు. తమిళ చిత్రాలంటే ఇష్టపెడి రామ్ ప్రస్తుతం చేస్తున్న` రెడ్ ‘ మూవీ కూడా తమిళ హిట్ మూవీ `తాడం ‘ కి రీమేక్ కావడం విశేషం .కాగా ఈ చిత్రం లో రామ్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దొంగ గా , బిజినెస్ మాన్ గా రామ్ నటిస్తున్న ఈ చిత్రం ఒక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. గతంలో రామ్ నటించిన ” నేను శైలజ , ఉన్నది ఒకటే జిందగీ ” సినిమాలకు దర్శకత్వం వహించిన కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. కాగా ఆ రెండు చిత్రాల్ని నిర్మించిన స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ మణిశర్మ సంగీతం వహించడం జరుగుతోంది.

    రామ్ కి తమిళంలో ఓ స్ట్రైట్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉందట .. అన్నీ కుదిరితే ఓ తమిళ్ మూవీ చేయడానికి తాను సిద్ధం అని రామ్ ఓ తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు .. చెన్నైలో పుట్టి పెరిగిన వాడిగా నాకు తమిళ భాషపై పట్టు వుంది. పైగా తమిళ సినిమా పై గౌరవం, ఇష్టం రెండూ ఉన్నాయి . అందుకే ఖచ్చితంగా ఓ తమిళ చిత్రం చేస్తానని రామ్ చెప్పడం విశేషం.