https://oktelugu.com/

RGV Tweet On Chiranjeevi: చిరంజీవి ని వదలని రాంగోపాల్ వర్మ

సోషల్ మీడియాలో చిరంజీవి, కీర్తి సురేష్ మీద దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ఇద్దరి వీడియోలను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అలాంటి ఓ ట్రోలింగ్ వీడియోనే వర్మ షేర్ చేశాడు.

Written By: , Updated On : August 9, 2023 / 02:12 PM IST
RGV Tweet On Chiranjeevi

RGV Tweet On Chiranjeevi

Follow us on

RGV Tweet On Chiranjeevi: రాంగోపాల్ వర్మ చిరంజీవికి మధ్యలో ఏమి జరిగిందో మనకు తెలియదు కానీ, మెగా ఫ్యామిలీ అంటే చాలు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్ లో ఆ హీరోల మీద చురకలు వేస్తూ ఉంటారు. అలా ఆయన వేసినందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఏమీ అనరు కానీ ఆయన పక్కన ఉన్న బ్యాచ్ మాత్రం రాంగోపాల్ వర్మ అని ఎలా గల టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు.

ముఖ్యంగా ఈ మధ్య హైపర్ ఆది మరీ హైపర్ అయిపోయి మెగా ఫ్యామిలీ కోసం అందరిని విమర్శించడం మొదలు పెట్టేశారు. ఆయన చేస్తున్న అది మెగా ఫ్యాన్స్ కి సైతం నచ్చడం లేదు. మొన్న బోళా శంకర్ ఫంక్షన్ లో .. చిరంజీవిని విమర్శించే వారందరి పైన అనేక వ్యాఖ్యలు చేశారు హైపర్ ఆది. వర్మ మీద కూడా సెటైర్లు వేశాడు. ఓ పెద్ద డైరక్టర్ ఉన్నాడు.. చిన్న పెగ్ వేస్తే చిరంజీవిని పెద్ద పెగ్ వేస్తే పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తుంటాడు.. ఆయనకు వాళ్లని విమర్శించే స్థాయి లేదంటూ ఇలా ఆర్జీవీ మీద పరోక్షంగా పేలిపోయాడు ఆది. దీనికి హర్ట్ అయ్యారో ఏమో తెలియదు కానీ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆ ప్రోగ్రాం లో చిరంజీవి కీర్తి సురేష్ తో చేసిన చిలిపి చేష్టలపై కౌంటర్లు వేశారు.

సోషల్ మీడియాలో చిరంజీవి, కీర్తి సురేష్ మీద దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ఇద్దరి వీడియోలను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అలాంటి ఓ ట్రోలింగ్ వీడియోనే వర్మ షేర్ చేశాడు. ఇక దానికి క్యాప్షన్ గా ‘నా ఒక్కడిలోనే ఇంత చిలిపితనం వుందని నేను అపోహ పడ్డాను , కానీ మీలోనూ ఇంత వుందని గ్రహించలేకపోయాను’ అని పెట్టేశారు ఆర్జీవి. దీంతో మళ్లీ మెగా ఫ్యాన్స్ కి ఆర్జీవి టార్గెట్ అయిపోయారు.

ఇక చిరంజీవి ప్రస్తుత సినిమా విషయానికి వస్తే మెహెర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్ ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తూ ఉండగా చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.