టాలీవుడ్ ఇండస్ట్రీలో Be The Real Man Challenge వైరల్ అవుతోంది. దర్శకుడు సందీప్ వంగా మొదలెట్టిన ఈ ఛాలెంజ్ ను సెలబ్రెటీలు హుషారుగా కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన సినీతారలకు ఈ ఛాలెంజ్ మంచి ఉత్సాహాన్నిస్తోంది. ఇంటి పనుల్లో మగవాళ్లు భాగస్వాములు కావాలనేది ఈ కాన్సెప్ట్ ఉద్దేశ్యం. తొలుత సందీప్ వంగా దర్శక దిగ్గజం రాజమౌళికి ఛాలెంజ్ విసిరి మరికొందరిని నామినేషన్ చేయాలని కోరాడు. దీనికి స్పందించిన రాజమౌళి ఇంటి పనులు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. దీనిలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత శోభు, దర్శకుడు సుకుమార్లను నామినేట్ చేశాడు.
రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం చీపురు పట్టి ఇల్లు క్లీన్ చేశాడు. వంట గిన్నెలు క్లీన్ చేస్తూ.. బయట చెత్తను తుడిచి శుభ్రం చేస్తున్న వీడియోను ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు.. పనులను కూడా పంచుకుందాం..’ అంటూ అద్భుతమైన సందేశాన్ని పోస్టు చేశాడు. అలాగే ఈ ఛాలెంజ్ కు తన బాబాయ్ బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, దర్శకుడు కొరటాల శివలను నామినేట్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా రాంచరణ్ కూడా రాజమౌళి ఛాలెంజ్ పూర్తి చేశాడు.
కొత్త పనిష్మెంట్ ఇస్తున్న బెజవాడ పోలీసులు!
రామ్ చరణ్ ఇంట్లో బట్టలు సర్దడంతోపాటు మాప్‌తో ఫ్లోర్ క్లీన్ చేశాడు. మొక్కలకు నీళ్లు పోసి అనంతరం భార్య ఉపాసనకు కాఫీ పెట్టిచ్చాడు. ఈ వీడియో తన ట్వీటర్లో పోస్టు చేసి అభిమానులో పంచుకున్నాడు. తన తరుఫున దర్శకుడు త్రివిక్రమ్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, రానా దగ్గుబాటి, శర్వానంద్ లను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Done @ssrajamouli garu !!
Let's take pride in doing chores at home! Let's be real men and help the women by sharing the work load.#BetheREALMAN
I further nominate Trivikram garu, @RanveerOfficial, @RanaDaggubati and @ImSharwanand to take up the challenge. pic.twitter.com/ItQ0zNQOR8
— Ram Charan (@AlwaysRamCharan) April 21, 2020